హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం.. షాకిచ్చే నిజాలు.. పరిస్థితి ఎంత ఘోరం అంటే..

Hyderabad Ganesh Immersion: గణేశ్ నవరాత్రుల తర్వాత హుస్సేన్ సాగర్‌లో ఎప్పుడూ లేనంతగా ఈ సారి 6200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వెలికి తీశారు. దాదాపు పది రోజులపాటు వ్యర్థాల తొలగింపు పనులను నిర్విరామంగా కొనసాగాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 16, 2019, 10:47 AM IST
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం.. షాకిచ్చే నిజాలు.. పరిస్థితి ఎంత ఘోరం అంటే..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 16, 2019, 10:47 AM IST
పర్యావరణం ఏమైతే మనకేంటి అనుకొని అత్యంత విషతుల్యమైన రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను కొనేశాం.. ఎదుటివారి కంటే తక్కువేం కాదంటూ పెద్ద పెద్ద విగ్రహాలు నెలకొల్పాం.. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా బొజ్జ గణపయ్యకు జేజేలు కొడుతూ నవరాత్రుల పాటు పూజలు చేశాం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొబ్బరికాయలు, అగరబత్తులు, కర్పూర హారతి, రకరకాల భోగాలు.. ఇలా దేవదేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి, పుణ్యం దక్కించుకోవడానికి ఎన్నో చేశాం.. కానీ, ఆ పుణ్యాన్ని దక్కించుకున్నామా? దేవుడు ప్రసన్నం అయ్యాడా? అంటే.. మనం చేసిన పనికి దేవుడికి కచ్చితంగా కోపం వచ్చే ఉంటుంది. అవును మరి.. గణపయ్య విగ్రహాలను నెలకొల్పింది మొదలు.. నవ రాత్రుల పాటు, ఆ తర్వాత శోభా యాత్రలో, నిమజ్జన కార్యక్రమంలో అన్నింటినీ కలుషితం చేస్తూ వచ్చామన్న సంగతి మీకు తెలుసా? ఇది కొందరికి షాక్ ఇవ్వొచ్చు.. కొందరు కామన్ అనుకోవచ్చు. కానీ, మనం చేస్తున్న కలుషితం వల్ల రాబోయే తరాలకు విషం పెడుతున్నామన్న సంగతి మరవొద్దని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నారో తెలుసా.. గణేశ్ నవరాత్రుల తర్వాత హుస్సేన్ సాగర్‌లో ఎప్పుడూ లేనంతగా ఈ సారి 6200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వెలికి తీశారు. దాదాపు పది రోజులపాటు వ్యర్థాల తొలగింపు పనులను నిర్విరామంగా కొనసాగాయి. హెచ్‌ఎండీఏ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని.. 1000 మంది లేబర్లు, 60 సూపరువైజర్లు, 28 జేసీబీలు, ఆధునిక యంత్రాలు ఎక్సావేటర్‌, ట్రాష్‌ కలెక్టర్‌, డ్రెజ్జింగ్‌ యుటిలిటీ క్రాప్టు యంత్రాలు నీళ్లలోనే ఉండి నిమజ్జనమైన విగ్రహాలు నీటి లోతుల్లోకి జారిపోకుండా క్షణాల్లోనే వెలికితీశారు. గత ఏడాది 6100 మెట్రిక్‌ టన్నుల మేర వ్యర్థాలను వెలికి తీసిన అధికారులు.. ఈ సారి 6200 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క హుస్సేన్ సాగర్‌లో ఈ స్థాయిలో వ్యర్థాలను వెలికి తీస్తే.. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్ని చెరువులు, కుంటలు, వాగులు, జలపాతాలు కలుషితం అయ్యాయో.. ఉన్నఫలంగా ఆలోచించాల్సిన అంశం.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...