హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హైదరాబాద్‌లో ఈ రోడ్లు, ఫ్లైఓవర్లు బంద్ .. వినాయక నిమజ్జనాలకు అంతా రెడీ    

Hyderabad: హైదరాబాద్‌లో ఈ రోడ్లు, ఫ్లైఓవర్లు బంద్ .. వినాయక నిమజ్జనాలకు అంతా రెడీ    

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ganesh Nimajjanam: సామూహిక వినాయక నిమజ్జనాలకు తెలంగాణ  ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.  ఇందుకోసం ట్రాఫిక్‌ను దారిమళ్లిస్తున్నారు. వినాయక  విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం జరిగే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల రోడ్లను మూసివేస్తున్నారు. 

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్‌ (Hyderabad)లో గణేశ్ నవరాత్రులు (Ganesh Navratri) నేటితో ముగుస్తాయి. తొమ్మిదవ రోజు అంటే.. ఇవాళ్టి నుంచి నగరవ్యాప్తంగా ఉన్న గణనాథులంతా గంగమ్మ ఒడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో సామూహిక వినాయక నిమజ్జనాలకు (Ganesh Nimajjanam) తెలంగాణ  ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.  ఇందుకోసం ట్రాఫిక్‌ను దారిమళ్లిస్తున్నారు.  వినాయక  విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం జరిగే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల రోడ్లను మూసివేస్తున్నారు. సెప్టెంబరు 9,10 రోజుల్లో న‌గ‌రంలోని చాలా వ‌ర‌కు రహదారులు వాహనదారులకు అందుబాటులో ఉండవు.IDL ట్యాంక్ వద్దకు సందర్శకులు వాహనాలు అనుమతించరు. కూకట్‌పల్లి 'వై' జంక్షన్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను JNTU, ఫోరమ్ మాల్ రోడ్డు మీదుగా దారి మళ్లించారు. హైటెక్ సిటీ, మాదాపూర్ నుండి కైతలాపూర్ మీదుగా కూకట్‌పల్లి 'వై' జంక్షన్‌కు వెళ్లే వాహనాలు.. రెయిన్‌బో విస్టా - మూసాపేట్ రోడ్డులో కూకట్‌పల్లి 'వై' జంక్షన్, బాలానగర్ వైపు వెళ్లాలి.
  అల్వాల్‌లోని హస్మత్‌పేట్ ట్యాంక్ దగ్గర గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేప‌థ్యంలో సాధార‌ణ వాహ‌నాలను అనుమతించరు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి, ఇతర కాలనీల నుంచి గణేష్ విగ్రహాలను తీసుకువెళ్ళే వాహనాలు అంజయ్యనగర్ మీదుగా హస్మత్‌పేట ట్యాంక్‌లోకి ప్రవేశించి విగ్రహాల నిమజ్జనం తర్వాత పాత బోయిన్‌పల్లి, మసీదు రోడ్డు, హరిజన బస్తీ వైపు బయలుదేరాలి.
  Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... ఈ రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  సూరారం కట్టమైసమ్మ ట్యాంక్ దగ్గర గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. బాలానగర్‌, జీడిమెట్ల నుంచి బహదూర్‌పల్లి,  బాచుపల్లి, గండిమైసమ్మ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, బౌరంపేట, గండిమైసమ్మ సమీపంలోని సూరారం గ్రామం వద్ద మళ్లించ‌నున్నారు.  గండిమైసమ్మ, బాచుపల్లి నుంచి జీడిమెట్ల, బాలానగర్‌ వైపు వెళ్లే వాహనాలు బహదూర్‌పల్లి జంక్షన్‌ వద్ద ఎడమవైపు దూలపల్లి గ్రామం టి జంక్షన్‌ - జీడిమెట్ల మీదుగా మళ్లిస్తారు.
  పత్తికుంట ట్యాంక్ దగ్గర గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం ట్రాఫిక్ మ‌ళ్లిస్తున్నారు. ORR నుంచి వచ్చే ట్రాఫిక్ ఎగ్జిట్ నెం. 17 ఆరామ్‌ఘర్, అత్తాపూర్ వైపు TSPA సర్వీస్ రోడ్ - లార్డ్స్ కళాశాల- L.V వద్ద మళ్లిస్తారు. పిల్లర్ నెం. 294 (శివరాంపల్లి) పిడిపి జంక్షన్ నుండి వచ్చే ట్రాఫిక్ బుద్వేల్ గ్రామం- కిస్మత్‌పూర్ గ్రామం-దర్గా గ్రామం కుడి మలుపు- ఎల్‌వి ప్రసాద్ ఐ కేర్ ఎడమ మలుపు- లార్డ్స్ కళాశాల TSPA జంక్షన్, హిమాయత్ సాగర్ టోల్‌గేట్ వైపు మళ్లింస్తారు.
  ఫతేనగర్ ఫ్లైఓవర్, సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్ ఫ్లైఓవర్‌త పాటు గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు 1, 2, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లై ఓవర్‌లపై గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనాలను అనుమతించరు. దుర్గం చెరువు వంతెన, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ (బాలానగర్), మల్కంచెరువు ఫ్లైఓవర్, కైతలాపూర్ ఫ్లైఓవర్, షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై భద్రతా సమస్యల కారణంగా వాహనాలను అనుమ‌తించ‌రు.
  Telangana: బీజేపీ గూటికి ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు..? టీఆర్ఎస్‌కి బిగ్ షాక్ తప్పదా..!
  బీహెచ్‌ఈఎల్ ఎక్స్ రోడ్డు నుంచి గోద్రెజ్ 'వై' జంక్షన్, కూకట్‌పల్లి 2.బాలానగర్ నుంచి ఫతేనగర్ వంతెన 3.గోద్రెజ్ నుంచి ఎర్రగడ్డ 4.ఫిరోజ్‌గూడ నుంచి గోద్రెజ్ వై 'జంక్షన్, కూకట్‌పల్లి 5.గూడెంమెట్ నుండి నర్సాపూర్ 'ఎక్స్' రోడ్డు 6.ఆరామ్‌ఘర్ ఎక్స్‌రోడ్ నుంచి PVNR ఫ్లైఓవర్‌పైనా వినాయక వాహనాలను అనుమతించరు.
  సంగారెడ్డి, పటాన్‌చెరు, BHEL నుంచి కూకట్‌పల్లి, హైదరాబాద్ సిటీ వైపు వెళ్లే అన్ని భారీ వాహనాలు (బస్సులతో సహా) అనుమతించరు. BHEL X రోడ్డు వద్ద 'U-టర్న్ తీసుకొని లింగంపల్లి, HCU, గచ్చిబౌలి, టోలిచౌకి వైపు వెళ్లాల్సి ఉంటుంది. BHEL, చందానగర్, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వైపు వచ్చే అన్ని భారీ వాహనాలు (బస్సులతో సహా) మియాపూర్ X రోడ్డు వద్ద మళ్లిస్తారు. ఎడమవైపుకు వెళ్లి బాచుపల్లి, దుండిగల్ రహదారి వైపు ప్రయాణించాలి. గచ్చిబౌలి, పటాన్‌చెరు నుంచి అరామ్‌ఘర్, అత్తాపూర్ వైపు వచ్చే హెవీ గూడ్స్ వాహనాలు ఎగ్జిట్ నెం. 17 (హిమాయత్ సాగర్) వద్ద దిగకూడదు. అలాగే ముందుకు వెళ్లి.. ORR ఎగ్జిట్ నెం.16 (శంషాబాద్) వద్ద దిగవచ్చు.


  హెల్ప్‌లైన్: రూట్స్ కు సంబంధించిన సందేహాల కోసం ప్ర‌త్యేక‌మైన‌ హెల్ప్ లైన్ నంబర్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. 040-23002424, 8500411111 నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Ganesh Visarjan 2022, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు