హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh Chaturthi 2022: మెగా వినాయక సంబరాలు.. చిరంజీవి ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి..

Ganesh Chaturthi 2022: మెగా వినాయక సంబరాలు.. చిరంజీవి ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి..

చిరంజీవి ఇంట్లో వినాయక సంబరాలు

చిరంజీవి ఇంట్లో వినాయక సంబరాలు

Ganesh Chaturhti 2022: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఓ వైపు హిట్ సినిమాలను గుర్తు చేస్తూ వినాయక ప్రతిమలు మార్కెట్లోకి వస్తే.. మరోవైపు సెలబ్రెటీల ఇండ్లలోనూ వినాయక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Mega Vinayaka Chavithi: భారత దేశ వ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు (Vinayaka Chavithi Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. కరోనా (Corona)  కారణంగా రెండేళ్ల పాటు ఈ వేడుకలను కఠిన నిబంధనల మధ్యే జరుపుకున్న భక్తులు.. ఈ సారి  తగ్గేదే లే అంటూ వేడుకలను నిర్వహిస్తున్నారు. అందుకే వీధి వీధినా గణపతి మండపాలు వెలిసాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సందడి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలు ఉన్నా.. భక్తులు (Devotees) మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఓ వైపు ప్రత్యేకంగా వెలసిన మండపాల్లో భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు చేస్తున్నారు. మరోవైపు గణపతి ఆలయాలకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. అలాగే హిందువులు అంతా ఈ తొలి పండుగను వారి ఇండ్లలో ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రెటీలు సైతం గణపతి పూజ నిర్వహిస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియా (Social Media) లో షేర్ చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంట్లోనూ గణపతి పూజ వేడుకగా జరిగింది. పర్యావరణపై అవగాహనతో అంతా మట్టి బొమ్మలే ఈ సారి పెడుతున్నారు. చిరంజీవి ఇంట్లో సైతం మట్టి బొమ్మకే ప్రత్యేక పూజలు చేశారు. చిరంజీవి తన భార్య.. తల్లి అందరితో కలిసి పూజలో పాల్గొన్నారు. అయితే దగ్గరుండి తన మనవరాలితో చిరంజీవి పూజ నిర్వహించారు..


  ఇలాచాలా మంది సెలబ్రెటీలు గణపతి పూజలను వేడుకగానే జరుపుకుంటున్నారు. మరోవైపు ఈ ఏడాది మార్కెట్లోకి చాలా వెరైటీ గణపతులు వచ్చాయి.. అందులో అల్లూ అర్జున్ ఫుష్ప సినిమాలో తగ్గెదే లే అనే సిగ్నేచర్ మార్క్ తో వచ్చిన వినాయక ప్రతిమలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పుష్పరాజ్ రూపంలో గణేష్ మహారాజ్ దర్శనమిస్తున్నారు.


  మరో చోటు వినాయకుడి ప్రతిమను తీసుకొస్తుంటే.. మధ్యలో ఓ గజరాజు.. ఆగి వినాయకుడి మెడలో పూల దండ వేసిన వీడియో కూడా వైరల్ గా మారింది..


  ఇలా దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. గణపతి బప్పా మోరియా అనే నినాదమే వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎక్కడ చూసినా వినాయక చవితి ఉత్సావాలు సందడిగా సాగాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chiranjeevi, Ganesh Chaturthi​, Vinayaka chavathi, Vinayaka Chavithi

  ఉత్తమ కథలు