Gandhi hospital rape case: గాంధీ ఆస్పత్రి అత్యాచారం ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు.. 4 రోజుల సస్పెన్స్‌కు తెర..!

గాంధీ అసుపత్రి

గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటన తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు కీలక పురోగతి లభించింది.

  • Share this:
    గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటన తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు కీలక పురోగతి లభించింది. నిందితుల్లో ఒకరిగా ఉన్న సెక్యూరిటీ గార్డు విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. అత్యాచారం జరిగినట్టుగా బాధిత మహిళ ఆరోపణలు వెలుగుచూసినప్పటీ నుంచి సెక్యూరిటీ గార్డు విజయ్ కనిపించకుండా పోయాడు. అయితే తాజాగా అతన్ని అదుపులోకి తీసుకన్న పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా విజయ్.. బాధితురాలిపై అత్యాచారం చేసినట్టుగా అంగీకరించినట్టుగా పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు బాధితురాలు విజయ్‌తో కలిసి వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజీ‌లో రికార్డు అయిన దృశ్యాలను పోలీసులు గుర్తించారు. అయితే బాధితురాలు.. అతనితో ఇష్టపూర్వకంగా వెళ్లిందా, లేకుంటే అతడే బలవంతంగా తీసుకెళ్లాడా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

    మరోవైపు ఈ ఘటన జరిగినప్పటీ నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరి ఆచూకీ లభించింది. దీంతో నాలుగు రోజులు సస్పెన్స్‌కు తెరపడినట్టే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హిమాయత్‌నగర్‌లో ఆమె ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనపై విచారిస్తున్నారు. అయితే ఆమె చెప్పే విషయాలు ఈ కేసులో కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి.

    గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అతని భార్య, మరదలిని అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌తో పాటు మరికొందరు అత్యాచారం చేసినట్టుగా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులుఈ కేసు నమోదు చేశారు. అలాగే తన సోదరి కనిపించకుండా పోయిందని బాధితురాలు తెలిపింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఉమామహేశ్వర్‌తో పాటు మరికొందరిన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే క్లూస్ టీమ్ గాంధీ ఆస్పత్రిలో పర్యటించి.. బాధిత మహిళ చెప్పిన స్థలంలో ఆధారాలు సేకరించింది.

    మరోవైపు ఈ కేసు విచారణ నిమిత్తం మహబూబ్‌నగర్‌కు వెళ్లిన పోలీసులు.. అక్కడ పలు విషయాలను తెలుసుకన్నారు. అక్కాచెల్లెళ్లకు మద్యం ఉపసంహరణ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే బాధితురాలిని రహస్య ప్రాంతంలో విచారించి.. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

    ఇదిలా ఉంటే.. గాంధీ ఆస్పత్రిలో మహిళను బంధించి లైంగికదాడికి పాల్పడ్డారనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలో సెక్యూరిటీ పటిష్టంగా ఉన్నదని.. ఇలాంటి ఘటనలకు అసలు ఆస్కారమే లేదని వారు చెప్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వాస్తవాలు పోలీసుల విచారణలో బయటకు వస్తాయని అన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: