గాంధీ నర్సులు ధర్నా విరమణ.. ప్రభుత్వం భారీ వరాలు...

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ధర్నా చేస్తున్న నర్సులు ఆందోళనను విరమించారు.

news18-telugu
Updated: July 15, 2020, 5:41 PM IST
గాంధీ నర్సులు ధర్నా విరమణ.. ప్రభుత్వం భారీ వరాలు...
గాంధీలో ధర్నా చేస్తున్న నర్సులు (File/Twitter)
  • Share this:
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ధర్నా చేస్తున్న నర్సులు ఆందోళనను విరమించారు. గాంధీ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తో ప్రభుత్వ చర్చలు జరిపింది. నర్సులకు రూ.17,500 ల నుంచి రూ.25 వేలకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, కరోనా డ్యూటీ చేస్తున్న వాళ్లకు డైలీ ఇంటెన్సివ్ కింద రూ.750 ఇస్తామని హామీ ఇచ్చింది. అవుట్ సోర్సింగ్ నుంచి, కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తామని ప్రభుత్వ హామీ ఇచ్చింది. నాలుగో తరగతి ఉద్యోగులకు రోజుకు రూ.300 ఇన్సెంటివ్, 15 రోజులు మాత్రమే డ్యూటీ వేస్తామని భరోసా ఇచ్చింది. దీంతో ఆందోళన విరమిస్తున్నట్లు నర్సులు ప్రకటించారు.

గాంధీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది ఐదు రోజులుగా  సమ్మె చేస్తున్నారు. నర్సులు ఇప్పటికే 5 రోజులుగా విధులు బహిష్కరించగా..  పారిశుద్ధ్య సిబ్బంది, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు సైతం సమ్మెకు దిగారు. గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. తమ జీతాలను రూ.25 వేల వరకు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ తమను రెగ్యులరైజ్​ చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వమే జీతాలివ్వాలని...ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. పీఎఫ్ జమలో ఉన్న అవకతవకలను సరిచేయాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రకటించిన 10 శాతం కరోనా ఇన్సెంటివ్​లు ఇప్పటి వరకు అందలేదన్న సిబ్బంది.. వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు వరుసగా వారం రోజులు డ్యూటీ చేసిన సిబ్బందికి వారం సెలవు ఇవ్వాలన్నారు. కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్​లు, శానిటైజర్స్​ ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పారు.



Published by: Ashok Kumar Bonepalli
First published: July 15, 2020, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading