హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP Corporator arrest: బీజేపీ కార్పొరేటర్​ను​ అరెస్టు చేసిన హైదరాబాద్​ పోలీసులు.. పూర్తి వివరాలివే

BJP Corporator arrest: బీజేపీ కార్పొరేటర్​ను​ అరెస్టు చేసిన హైదరాబాద్​ పోలీసులు.. పూర్తి వివరాలివే

ఫ్రెండ్ షిప్ పేరుతో హద్దులు దాటారు

ఫ్రెండ్ షిప్ పేరుతో హద్దులు దాటారు

గడ్డి అన్నారం బీజేపీ కార్పొరేటర్​ ప్రేం మహేశ్వర్​రెడ్డి హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఓ యువకుడి కిడ్నాప్​లో కార్పొరేటర్​ కీలక సూత్రధారిగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్​లో (Hyderabad) ఇటీవల జరిగిన యువకుడి కిడ్నాప్​ కథ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ యువకుడి కిడ్నాప్‌ కేసులో పోలీసులు గడ్డిఅన్నారం బీజేపీ కార్పొరేటర్‌ (Gaddi annaram BJp Corporator) బద్దం ప్రేంమహేశ్వర్‌రెడ్డిని (Prem Maheswar reddy) ప్రధాన సూత్రధారిగా తేల్చారు. ఆస్తి తగాదాలతోపాటు రాజకీయ వైరం నేపథ్యంలోనే కిడ్నాప్‌నకు (Kidnap) కుట్ర చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో 15 మంది పాల్గొనగా పది మందిని అరెస్టు చేశారు.

  పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్​లోని (Hyderabad) పీఅండ్‌టీ కాలనీకి చెందిన బీజేపీ బహిష్కృత నేత లంకా లక్ష్మీనారాయణ (Lakshmi Narayana) సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని కార్పొరేటర్‌ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా కార్పొరేటర్‌ అనుచరుడు శ్రవణ్‌ బంధువులను సైతం ఆయన వేధిస్తున్నాడని, అలాగే లక్ష్మీనారాయణ సోదరుడు లంకా మురళి కూడా తమ ఆస్తి తగాదా విషయంలో న్యాయం చేయాలని శ్రవణ్‌ను వేడుకున్నాడు. ఈ విషయాలను శ్రవణ్‌ కార్పొరేటర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వనస్థలిపురానికి చెందిన బీజేపీ సానుభూతిపరుడు పునీత్‌ తివారీతో మాట్లాడిన కార్పొరేటర్‌.. లక్ష్మీనారాయణకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని కిడ్నాప్‌ చేసి కొట్టాలని పురమాయించాడు శ్రవణ్‌.

  ఇక పునీత్‌ కార్పొరేటర్‌ ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి ప్రొద్బలంతో  13 మందితో బృందం ఏర్పాటు చేసుకొన్నాడు. సెప్టెంబర్‌ 1న అర్థరాత్రి పీఅండ్‌టీ కాలనీలోని గణేశ్‌ మండపం వద్దకు వచ్చిన పునీత్‌ బృం దం.. లక్ష్మీనారాయణ కోసం ఎంక్వైరీ చేశారు లక్ష్మీనారాయణ నిద్రిస్తున్నాడని తెలుసుకొని అతని కొడుకు సుబ్రహ్మణ్యంను కిడ్నాప్‌ చేశా రు.  మార్గమధ్యలో అతడిని చిత్రహింసలు పెట్టారు. అనంతరం యువకుడిని నల్గొండ జిల్లా చింతాలపల్లికి తీసుకెళ్లారు. ఈలోగా బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా యువకుడిని గుర్తించారు.

  Revanth reddy: మోదీ ఫొటో లేదని పంచాయితీ చేస్తారా? కేంద్ర మంత్రికి TPCC చీఫ్​ రేవంత్ రెడ్డి లేఖ

  అయితే నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా  బీజేపీ కార్పొరేటర్‌ సూచనల మేరకే తాము కిడ్నాప్‌నకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కార్పొరేటర్‌ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డిని శనివారం అరెస్ట్‌ చేశారు.

  TRSLP Meeting: ఆద్యంతం ఆసక్తికరంగా టీఆర్​ఎస్​ఎల్పీ సమావేశం.. ఈడీ, సీబీఐలపై KCR హెచ్చరిక

  సుబ్రహ్మణ్యం కిడ్నాప్‌ కేసులో గడ్డిఅన్నారం కార్పొరేటర్‌ బద్దం ప్రేంమహేశ్వర్‌రెడ్డి సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పునీత్‌, పోతబోయిన మంజునాథ్‌, పాల్పర్తి రవి, కందాల పవన్‌కుమార్‌, రావాల హేమంత్‌, రేవల్లి చంద్రకాంత్‌, బలివాడ ప్రణీత్‌, కుంబగిరి కార్తీక్‌, మోరుపోజు రవి వర్మను అరెస్టు చేశారు. కాగా, శ్రవణ్‌, లంక మురళి, మహేశ్‌, మారుతి, సాయికిరణ్‌ పరారీలో ఉన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad, Kidnap, Police arrest, Telangana bjp

  ఉత్తమ కథలు