Home /News /telangana /

HYDERABAD FRUSTRATED YOUNG WOMAN ATTACKED ON HOSPITAL AFTER 88 YEARS OLD GRAND FATHER DIED WITH CORONA IN HYDERABAD HSN

Hyderabad: కరోనాతో 88 ఏళ్ల వయసున్న వృద్ధుడి మృతి.. మా తాత మీవల్లే చనిపోయాడంటూ ఆస్పత్రిలో రచ్చ రచ్చ చేసిన యువతి

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువతి, పాడయిపోయిన వెంటిలేటర్ (ఫైల్ ఫొటోలు)

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువతి, పాడయిపోయిన వెంటిలేటర్ (ఫైల్ ఫొటోలు)

కరోనా మనిషి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నా వైద్యులు అపనిందను మోయాల్సి వస్తోంది. ఆసుపత్రిలో రోగి బంధువులు నానా రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఓ కరోనా రోగి చనిపోతే అతడి మనవరాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.

    కరోనా కారణంగా వైద్యులకు ఊపిరి సలపనంత పని వచ్చిపడింది. నిమిషం కూడా రెస్ట్ తీసుకునే వీలు లేకుండా పోతోంది. ప్రజలంతా వైద్యుల వైపే ఆశగా చూస్తున్నారు. కనిపించే దైవంగా కొనియాడుతున్నారు. వైద్యులు కూడా తమ వద్దకు వచ్చిన కరోనా కేసులను వయసుతో సంబంధం లేకుండా శక్తివంతమైన మేరకు కోలుకోవాలనే చికిత్సను అందిస్తున్నారు. వారిలో గతంలో ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా పరిస్థితి మరింత విషమించిన సమయాల్లో మాత్రం కరోనా పేషెంట్లు మరణిస్తున్నారు. పాడు కరోనా మనిషి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నా కొన్ని కొన్ని సార్లు వైద్యులు అపనిందను మోయాల్సి వస్తోంది. ఆసుపత్రిలో రోగి బంధువులు నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోనూ ఓ కరోనా రోగి చనిపోతే అతడి మనవరాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

    హైదరాబాద్ లోని కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో బోడుప్పల్ కు చెందిన 88 ఏళ్ల సంజీవ్ రావు కరోనా బారిన పడి నాలుగు రోజుల క్రితం చికిత్స నిమిత్తం చేరాడు. అయితే వయసు మీరిపోవడంతోపాటు అతడికి గతంలో కూడా కొన్ని అనారోగ్య కారణాలు ఉండటంతో పరిస్థితి విషమించింది. సంజీవ్ రావును కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. చివరకు మూడ్రోజుల పాటు 12 లీటర్ల ఆక్సిజన్ ను అతడికి పెట్టారు కూడా. అయితే అతడి పరిస్థితి ఏమాత్రం బాగాలేదనీ, వెంటిలేటర్ పైకి తరలించాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. దీనికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

    గురువారం అతడి పరిస్థితి తీవ్రంగా విషమించింది. దీంతో వైద్యులు అతడికి వెంటిలేటర్ పెట్టారు. ఆ తర్వాత కొద్ది సేపటికే సంజీవ్ రావు మరణించాడు. అయితే తమ తాతయ్య మృతికి వైద్యులే కారణమంటూ అతడి మనవరాలు ఆస్పత్రిలోనే రచ్చ రచ్చ చేసింది. సంజీవ్ రావుకు పెట్టిన వెంటిలేటర్ ను పగలగొట్టింది. చేతికి దొరికిన వస్తువులను కిందకు విసిరేసింది. ఏడుస్తూ, డాక్టర్లను నిందిస్తూ పెద్ద బీభత్సమే సృష్టించింది. ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వారించడంతో అదుపులోకి వచ్చింది. కాగా, యువతిపై చర్యలు తీసుకోవాలంటూ కింగ్ కోఠి ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నారాయణగూడ పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Corona cases, Crime news, CYBER CRIME, Hyderabad, Telangana, Telangana crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు