హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ఫ్రెండ్షిప్ డే కదా అని సరదాగా పబ్‌కు వెళ్లారు.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయారు..

Hyderabad: ఫ్రెండ్షిప్ డే కదా అని సరదాగా పబ్‌కు వెళ్లారు.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయారు..

ఆశ్రిత

ఆశ్రిత

ఫ్రెండ్షిప్ డే కావడంతో ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారు. పబ్‌కు వెళ్లి.. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. కానీ ఇలాంటి విషాదం జరుగుతుందని ఊహించలేకపోాయారు.

ఫ్రెండ్షిప్ డే కావడంతో ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారు. పబ్‌కు వెళ్లి.. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఇంటికి తిరిగివస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదం.. వారిలోని ఓ  స్నేహితురాలు ప్రాణాను బలిగొంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. తెల్లాపూర్‌ బొన్సాయ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న డి.వినయ్‌కుమార్‌ ఎంఆర్‌ఎఫ్‌ సంస్థ ఉద్యోగి. ఆయన కుమార్తె డి.ఆశ్రిత(23), తరుణి(23), సాయిప్రకాష్‌(23) శంకర్‌పల్లిలోని ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌లో గత ఏడాది బీబీఏ పూర్తిచేశారు. బీబీఏ పూర్తిచేశాక.. ఆశ్రిత ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లింది. సాయిప్రకాష్‌ మాదాపూర్‌లోని విజువల్‌ హ్యాష్‌ టెక్నాలజీస్‌లో, తరుణి రాయదుర్గంలోని వెల్స్‌ఫార్గో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక, ఆశ్రిత కొద్ది రోజుల కిందటే కెనడా నుంచి ఇంటికి వచ్చింది.

అయితే అశ్రిత, తరుణి, సాయిప్రకాశ్‌లు మదీనా గూడలో ఉండే అభిషేక్‌లు ఆదివారం ఫ్రెండ్షిప్ డే కావడంతో కలవాలని అనుకన్నారు. ఈ క్రమంలోనే అభిషేక్‌ తన కారులో సాయిప్రకాష్‌తో కలిసి ఆశ్రిత ఇంటికి వెళ్లాడు. దీంతో ఆశ్రిత తల్లిదండ్రులతో ఫ్రెండ్స్‌తో వెళ్తున్నట్టుగా చెప్పింది. వారు కూడా తెలిసిన వారే కావడంతో పంపించారు. వీళ్లు ముగ్గురు, తరుణితో కలిసి నలుగురూ మాదాపూర్‌ హైటెక్స్‌ రోడ్డులోని స్నార్ట్‌ పబ్‌కు రాత్రి 10 గంటలకు వెళ్లారు. అలాగే మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ను కూడా ఆహ్వానించారు. పబ్‌లో సాయిప్రకాశ్, అభిషేక్ మద్యం తాగారు.

అనంతరం రాత్రి 11 గంటలకు మదీనగూడకు బయలుదేరారు. అభిషేక్‌ కారు నడుపుతుండగా.. సాయిప్రకాశ్ ముందు సీట్‌లో, ఆశ్రిత, తరుణిలు వెనకాల సీట్లో కూర్చొన్నారు. అయితే కొండాపూర్‌లోని మైహోం మంగళ అపార్టుమెంట్స్‌ వద్ద అభిషేక్‌ కారు అదుపు తప్పింది. బండరాళ్లను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారు డోరు తెరుచుకోవడంతో ఆశ్రిత రోడ్డుపై ఎగిరి పడింది. పక్కనే కూర్చున్న తరుణి లోపలే ఇరుక్కుపోయింది. ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ముందు కూర్చున్న సాయిప్రకాశ్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ఇక, తీవ్ర గాయాలైన ఆశ్రిత, తరుణిలను ఆస్పత్రికి తరలించగా.. ఆశ్రిత అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్దారించారు. ఇక, తరుణి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా సమాచారం. ఇక, ఈ ప్రమాదానికి మద్యం సేవించి అతి వేగంగా వాహనం నడపడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారు డ్రైవ్ చేసిన అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లిన కూతురును.. ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని ఆశ్రిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

First published:

Tags: Friendship Day, Hyderabad, Road accident

ఉత్తమ కథలు