Home /News /telangana /

HYDERABAD FRIENDS WHO KILLED ACCUSED IN SAROOR NAGAR MURDER CASE SNR

Telangana: తల్లిని చంపాడు..వారం తిరగకుండా ఫ్రెండ్స్‌ చేతిలో చచ్చాడు

(చంపాడు..చచ్చాడు)

(చంపాడు..చచ్చాడు)

Brutal murder:హైదరాబాద్ సరూర్‌నగర్‌లో తల్లిని చంపిన కొడుకు హత్యకు గురయ్యాడు. డబ్బు కోసం ఇంట్లో చోరీకి సుపారీ ఇచ్చిన సాయితేజను అతని స్నేహితులే అంతమొందించారు. తల్లి చనిపోయిన వారం రోజుల్లోపేనిందితుడు చనిపోవడంతో పోలీసులు మిగిలి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
  అన్నంపెట్టిన అమ్మనే చంపేశాడు. వారం రోజులు గడవక ముందే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. దురలవాట్లు, చెడు సాహవాసంతో ఓ యువకుడు కిరాతకుడిగా మారాడు. ఈనెల 7వ తేదిన సరూర్‌నగర్‌(Saroor Nagar)లోని న్యూగడ్డి అన్నారం కాలనీకి చెందిన భూదేవి(Bhudevi) అనే మహిళను ఆమె దత్తపుత్రుడు సాయితేజ(Saiteja)మరికొందరితో కలిసి హతమార్చాడు. ఇది జరిగి వారం రోజులు గడవక ముందే సాయితేజను అతని స్నేహితులే పథకం ప్రకారం హతమార్చారు. తల్లిని చంపి ఇంట్లో దొంగిలించిన నగలు, డబ్బు తీసుకున్న నిందితులే అతడ్ని శ్రీశైలం(Srisailam)టూర్‌ పేరుతో తీసుకెళ్లి హత్య చేశారు. మృతుడు సాయితేజకు గర్ల్‌ ఫ్రెండ్ ఉండటంతో ఆమె పేరుతో ఈ నెల 7న మధ్యాహ్నం శ్రీశైలం వెళ్దామని అక్కడ నీ ప్రియురాలిని కలుసుకోవచ్చని శివ అనే ఫ్రెండ్స్ చెప్పిన మాటలను సాయితేజ నమ్మాడు. అతనితో కలిసి శ్రీశైలం వెళ్లాడు. అదే రోజు రాత్రి సత్రంలో పడుకొని...మరుసటి రోజు దర్శనం చేసుకున్నారు. 9వ తేదిన వట్టెటవారిపల్లి(Vattetavaripalli)కి చేరుకున్నారు.ఈనెల 10వ తేదిన ఉదయం సాయితేజ, శివ(Shiva) అమ్రాబాద్‌ Amrabadమండలంలోని మల్లెలతీర్థం జలపాతానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగిన తర్వాత శివ సాయితేజతో ఘర్షణ పడ్డాడు. మర్డర్ స్కెచ్‌లో భాగంగానే సాయితేజ తలపై బండరాయితో కొట్టి చంపాడు. అటుపై మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేలా బండరాయితో ముఖం చిద్రం చేసి శవాన్ని మల్లెలతీర్థం కింది భాగంలో ఉన్న నీటి గుండంలో పడేశాడు.

  చంపాడు..చచ్చాడు..
  సాయితేజను హతమార్చిన శివ భయపడిపోయి మరుసటి రోజు హైదరాబాద్‌కు చేరుకొని సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. అతనిచ్చిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని తీసుకొని మల్లెల తీర్ధం జలపాతానికి వెళ్లారు. అమ్రాబాద్‌ పోలీసులు, అటవీ అధికారుల సహకారంతో సాయి తేజ మృతదేహాన్ని వెలికితీశారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. నిందితుడు శివ దగ్గరున్న లక్షా 40వేల క్యాష్‌తో పాటు బంగారు నగల్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు సాయితేజను హత్య చేయడానికి గల కారణాలను పోలీసులు రాబట్టారు. ఈకేసులో మరికొందరు నేరస్తుల పేర్లు బయటకు వచ్చాయి. సాయితేజ తండ్రి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న నర్సింహా ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతని సహాయంతోనే సాయితేజ ఈనెల 6వ తేదిన సరూర్‌నగర్‌లోని తన ఇంట్లో చోరీకి పాల్పడినట్లుగా తేల్చారు. దొంగతనం చేసే క్రమంలోనే తల్లి నిద్రలేవడంతో ఆమెను దిండుతో ముఖంపై అదిమి చంపారు సాయితేజ, పట్టుబడ్డ శివ.

  తల్లిని చంపిన కొడుకు హతం..
  మృతుడు సాయితేజ తండ్రి అంజయ్య, రియల్‌ ఎస్టేట్ వ్యాపారి.అంజయ్య, భూదేవి దంపతులకు పిల్లలు లేకపోవడంతో 1995లో బంధువులకు చెందిన సాయితేజను దత్తత తీసుకొని పెంచుకున్నారు. మృతుడు సాయితేజకు మతిస్థిమితం సరిగాలేకపోడంతో తండ్రి దగ్గర పనిచేస్తున్న నర్సింహతో చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. అదే క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్‌కి డబ్బులు ఇవ్వాలని ఇంట్లో ఉన్న నగలు, నగదు చోరీకి నర్సింహతో ప్లాన్ చేశాడు సాయితేజ. ఈ చోరి కోసం నర్సింహ తన స్నేహితులైన శివ, చింటు, అంజి, సాయిగౌడ్‌ అనే మరికొందరితో సరూర్‌నగర్‌లోని సాయితేజ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అదే సమయంలో నిద్రపోతున్న భూదేవికి లేచి చూడటంతో ఆమెను హతమార్చినట్లుగా పోలీసుల ఇంటారాగేషన్‌లో తేలింది.

  నేరం బయటపడకుండా..
  సాయితేజ ఇంట్లో చోరీ చేసిన విషయం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో నర్సింహనే శివతో సాయితేజను చంపమని ప్లాన్ వేశాడు. అందుకోసం డబ్బులు ఇవ్వడంతో సాయితేజను శ్రీశైలం టూర్‌ పేరుతో తీసుకొచ్చి హత్య చేసినట్లుగా శివ అంగీకరించాడు. ఈకేసులో మిగిలిన నేరస్తుల్లో కొందర్ని పట్టుకోగా మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Burtally murder, Hyderabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు