Home /News /telangana /

HYDERABAD FREE TRAVEL IN RTC BUSES ON 15TH AUGUST TSRTC REDUCED T24 TICKET TO RS 75 SNR

Telangana | TS RTC : ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ పంద్రాగస్ట్ గిఫ్ట్ .. వాళ్లకు ఫ్రీ జర్నీ, రూ.75కే టీ24 టికెట్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Telangana | TS RTC : స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 15వ తేది నాడు రాష్ట్రంలోని అన్నీ వర్గాల వారికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మరీ ముఖ్యంగా వాళ్లకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు(Independence Diamond Jubilee) జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TS RTC) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 15వ తేది నాడు వయో వృద్ధుల(Senior citizens)తో పాటు 12ఏళ్లలోపు పిల్లల( Under 12 years Children)కు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. వీటితో పాటు మిగిలిన ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్లకు మరో అధ్భుతమైన బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. ప్రజా రవాణా సౌకర్యంలో దూసుకుపోతున్న టీఎస్‌ ఆర్టీసీ ప్రజలకు రవాణా సంస్థపై నమ్మకంతో పాటు అలవాటు పడే విధంగా ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ని ప్రకటిస్తున్నట్లుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar)ట్విట్టర్(Twitter)ద్వారా తెలియజేశారు.

Telangana : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు..అక్కడ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలంటే..



ప్రయాణికులకు పంద్రాగస్ట్‌ కానుక..
ప్రజారవాణా సౌకర్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు టీఎస్‌ ఆర్టీసీ విస్తృతమైన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 15వ తేదిన 75సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ఆగస్ట్ 15వ తేదిన ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చని ప్రకటించింది. అలాగే ఆగస్ట్ 15న పుట్టిన చిన్నారులకు మరో భవిష్యత్ కానుకను ప్రకటించింది. ఆగస్ట్ 15 సోమవారం పుట్టిన పిల్లలు 12ఏళ్ల వయసు వచ్చే వరకు రాష్ట్రంలోని అన్నీ ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి టికెట్ లేకుండా ప్రయాణించవచ్చని ఇండిపెండెన్స్‌ డే కానుకను ప్రకటించింది.



వాళ్లందరికి ఆ రోజున పండగే..
రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్స్, పిల్లలతో పాటు మిగిలిన వర్గాలకు లబ్ధి జరిగేలా మరో ఆఫర్‌ని ప్రకటించింది టీఎస్‌ ఆర్టీసీ. ప్రస్తుతం ఒకరోజు టికెట్ ..ట్రావెల్ యాజ్‌ యు లైక్ టికెట్‌ ధర 120 రూపాయలు ఉంది. దాన్ని ఆగస్ట్ 15వ తేది నాడు 75రూపాయలకే విక్రయిస్తున్నట్లుగా ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలో అనేక టూరిస్ట్ ప్లేసులు, చారిత్రక ప్రదేశాలను ఉచితంగా చూడవచ్చని పురావస్తుశాఖ ప్రకటించింది. ఇక టీ24 టికెట్‌ తీసుకుంటే 75రూపాయలకే సిటీలోని అనే పర్యాటక ప్రదేశాలను చూసే అవకాశం ఉంది.

PV Sindhu | CM KCR : కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పీవి సింధుకు గోల్డ్ మెడల్ .. అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్



ఫ్రీ ..ఫ్రీ.. ఫ్రీ ..
ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లోనూ రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించనున్నట్టు తెలిపింది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో జాతీయ పతకాన్ని ఏర్పాటు చేయనుంది. ఉద్యోగులందరూ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ బ్యాడ్జీలతోనే విధులకు హాజరవుతారు. వీటితోపాటు మరిన్ని ఆఫర్లను కూడా టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Telangana News, Tsrtc

తదుపరి వార్తలు