హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్‌లో పండగపూట దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

హైదరాబాద్‌లో పండగపూట దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేయడం కలకలం రేపుతోంది. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉండటం స్థానికుల కంట కన్నీరు పెట్టిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుబంలో ఓకేసారి  వరుస ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. నగరంలో  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ తార్నాకలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్నటి నుంచి ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి షాక్ అయ్యారు.

తార్నాకలోని రూపాళి అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలిక సహా నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు దంపతులు,  ఓ మహిళతో పాటు... నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మృతులు ప్రతాప్, సింధూర, ఆర్య, ప్రతాప్ తల్లిగా గుర్తించారు.  దీంతో ఈ వార్త విని చుట్టుపక్కల వారంతా ... తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతాప్ చెన్నై షోరూంలో కారు డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. సింధూర.. హిమయత్ నగర్‌లోని ప్రైవేటు బ్యాంకులోని మేనేజర్‌గా పనిచేస్తుంది.

అయితే కుటుంబం ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణం అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులతో పాటు.. మృతుల కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పండగపూట వీరి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

First published:

Tags: Hyderabad, Local News

ఉత్తమ కథలు