Home /News /telangana /

HYDERABAD FOUR ACCUSED IN HYDERABAD BEGUM BAZAR MURDER CASE IDENTIFIED SNR

Honor Killing:హైదరాబాద్‌ నడిరోడ్డుపై పరువుహత్య..24గంటల్లో నిందితులు అరెస్ట్

(పరువుహత్యకు పక్కా స్కెచ్)

(పరువుహత్యకు పక్కా స్కెచ్)

Honor Killing:పరువు కోసం ప్రాణాలు తీశారు. నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకుందనే కోపంతో సొంత సోదరి భర్తను స్నేహితులతో కలిసి రెక్కీ నిర్వహించి చంపారు. హైదరాబాద్‌ బేగంబజార్‌లో జరిగిన మర్డర్‌ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితుల్ని గుర్తించారు పోలీసులు. అయితే నిందితుల్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తోంది మృతుడు నీరజ్‌ భార్య సంజన.

ఇంకా చదవండి ...
తెలంగాణ(Telangana)లో వారం రోజులకు ఓ పరువు హత్య జరగడం ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపైన వేటాడి, వెంటాడుతూ నరికి చంపుతున్న దృశ్యాలు, మృతులు రక్తపు మడుగులో పడి చనిపోవడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు లేవా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బేగంబజార్‌(Begum Bazar)లో శుక్రవారం(Friday)రాత్రి జరిగిన నీరజ్ పన్వార్(Neeraj Panwar)మర్డర్ కేసు మరింత కలకలం రేపింది. నీరజ్ పన్వార్‌ హత్య ఖచ్చితంగా పరువు హత్యేనంటోంది మృతుని భార్య సంజన(Sanjana) తనకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తోంది. ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొని కుటుంబ సభ్యులను వదిలి వచ్చి వేరే ఉంటుంటే తన భర్తను హత్య(Murder)చేశారని తెలిపింది బాధితురాలు సంజన. నీరజ్ పన్వార్‌ని తన సోదరులు నందన్, చిక్కు, సంజూ చంపారని వాళ్లను విడిచిపెట్టవద్దని డిమాండ్ చేస్తోంది. నీరజ్‌ ను హతమార్చి పారిపోయిన నిందితుల్ని క‌ర్నాట‌క‌లోని గురుమ‌త్క‌ల్‌లో అదుపులోకి తీసుకున్నారు  పోలీసులు. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. మరో 10మందిని విచారిస్తున్నారు.

పరువు హత్యల పరంపర..
ప్రేమించి పెళ్లి చేసుకున్న సమయంలోనే తమను చంపుతామని కుటుంబ సభ్యులు బెదిరించిన విషయాన్ని నీరజ్ భార్య సంజన చెబుతోంది. మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇద్దరూ అవసరం లేదని..ఎలాగైనా చంపుతామని వార్నింగ్ ఇస్తే పెళ్లి చేసుకున్న సమయంలో అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశామని మృతుని భార్య చెబుతోంది. ఈవిషయంలో పోలీసులు తమకు భద్రత ఇవ్వలేకపోయారని..క్యాష్ వసూలు చేసుకొచ్చేందుకు వెళ్లిన తన భర్తను దారి కాచి మరీ హత్య చేశారని.. కన్నీటి పర్యంతమవుతోంది. తనకు, తనకు పుట్టిన పసిబిడ్డకు న్యాయం చేయాలని ఎలాగైనా తన భర్త నీరజ్‌ పన్వార్‌ని చంపిన ముగ్గురికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తోంది.

(పరువు హత్యకు పక్కా స్కెచ్)
(పరువు హత్యకు పక్కా స్కెచ్)


నడిరోడ్డుపై రాక్షసత్వం..
పెళ్లి చేసుకున్న క్షణ నుంచి తన భర్త నీరజ్ పన్వార్‌ను హత్య చేయడానికి పుట్టింటి వాళ్లు ఎదురుచూస్తున్నారని వాపోయింది బాధితురాలు సంజన. హత్యకు ముందు మూడ్రోజుల నుంచి నీరజ్‌ని చంపేందుకు కత్తులు, తల్వార్లు పట్టుకొని ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారని మృతుని తల్లి తెలిపింది. నీరజ్‌ తండ్రి రాజేందర్‌ పన్వార్‌ రోదిస్తూ ఆరోపించారు. వారితో తన కుమారుడికి ప్రాణహాని ఉందని గతంలో అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకోవడంతో ఏడాదిన్నరగా కక్ష పెంచుకున్న వారు తన కొడుకును హత్య చేశారని ఆరోపించారు. తన కుమారుడని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

కత్తులు దూసి కసి తీర్చుకున్నారు..
మర్డర్ స్కెచ్‌లో భాగంగానే తాత జగదీష్‌ పన్వార్‌తో కలిసి కైనెటిక్‌ హోండాపై వెళ్తున్న నీరజ్‌ను సంజన సోదరులు అతని స్నేహితులతో కలిసి అడ్డుకొని కత్తులతో అత్యంత కిరాతకంగా హతమార్చారు. శరీరంలో 15 చోట్ల కత్తులతో పొడవడంతో స్పాట్‌లో చనిపోయాడు. రద్దీగా ఉండే రోడ్డుపై రాత్రి 7.30గంటల సమయంలో హత్య జరుగుతుంటే నిందితుల చేతుల్లో కత్తులు ఉండటంతో వారిని అడ్డుకునే సాహసం ఎవరూ చేయలేకపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయడంతో స్పాట్‌కి చేరుకున్న గోషామహల్ పోలీసులు నీరజ్‌ను ఉస్మానియాకు తరలించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈ మర్డర్‌ కేసులో మొత్తం నలుగురు వ్యక్తులు నీరజ్‌ పన్వార్‌ను అడ్డగించి కత్తులతో దాడి చేసినట్లు ఏసీపీ సతీష్‌కుమార్ తెలిపారు. క్లూస్‌ టీం, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని క‌ర్నాట‌క‌లోని గురుమ‌త్క‌ల్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. మరో పది మందిని విచారిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Brutally murder, Hyderabad, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు