హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Congress: పోలీసులకు క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్​ మాజీ ఎంపీ రేణుకా చౌదరి.. అసలేం జరిగిందంటే?

Telangana Congress: పోలీసులకు క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్​ మాజీ ఎంపీ రేణుకా చౌదరి.. అసలేం జరిగిందంటే?

రేణుకా చౌదరి (File Image: Twitter)

రేణుకా చౌదరి (File Image: Twitter)

రాజ్​భవన్​ ముట్టడిలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి వ్యవహారశైలి వివాదాస్పదమైంది. పంజాగుట్ట ఎస్ఐ కాలర్ పట్టుకోవడం రేణుకపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై కేసు సైతం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి దిగి వచ్చారు. ఎస్‌ఐకి క్షమాపణలు చెప్పారు.

ఇంకా చదవండి ...

  మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రేణుకా చౌదరి (Congress Former MP Renuka Chowdary)పై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. గురువారం చలో రాజ్‌భవన్‌ (Raj Bhavan) సందర్భంగా.. పోలీసులతో (Police) ఆమె దురుసుగా ప్రవర్తించిన ఫుటేజ్‌లు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఎస్సై కాలర్‌ పట్టుకున్నారు ఆమె. దీంతో ఎస్‌ఐ ఉపేంద్ర బాబు ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 353 కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఛలో రాజ్‌భవన్‌లో పోలీసులతో దురుసు ప్రవర్తనపై. రేణుకా చౌదరిపై కేసు నమోదు అయ్యింది.

  ఘటన తర్వాత పోలీసులు బలవంతంగా ఆమెను అరెస్ట్‌ చేసి గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రేణుకా చౌదరిని రిమాండ్‌కు తరలించే యోచనలో ఉన్నారు పోలీసులు. అయితే దురుసు ప్రవర్తన ఆరోపణలపై రేణుకా చౌదరి స్పందించారు. వెనకాల నుంచి తోసేయడంతో.. ఎస్ఐ భుజం పట్టుకున్నానని, అవమానపరిచే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో తెలుసని, పోలీసుల (Police) పట్ల గౌరవం ఉందని ఆమె అన్నారు.

  దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ల ముట్టడి..

  ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు దాడి చేశారని ఎఐసీసీ నేత రణదీప్ సూర్జేవాలా చెప్పారు. ఈ ఘటనను నిరసిస్తూ గురువారం  దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ల (raj Bhavana) ముట్టడికి కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొంది.

  చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్​ (Telangana Congress) సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయినా కూడా పోలీసుల భద్రతను చేధించుకొని కాంగ్రెస్ నేతలు కొందరు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. ఖైరతాబాద్​ జంక్షన్ వద్ద బైక్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్సుపై నిలబడి ఆందోళన చేశారు. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.

  డోంట్ టచ్ మీ అంటూ..

  రాజ్ భవన్ పైపునకు వెళ్తునన CLP నేత భట్టి విక్రమార్క ను డీసీపీ జోయల్​ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. డీసీపీ సహా పోలీసులతో  విక్రమార్క వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో డీసీపీ జోయల్ ను భట్టి  వెనక్కి నెట్టివేశారు. రాజ్ భవన్ వైపునకు వెళ్తున్న మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని (Renuka Chowdhury)ని పోలీసులు అనుసరించారు. డోంట్ టచ్ మీ (Don't Touch me) అంటూ రేణుకా చౌదరి పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను రాజ్ భవన్ లోకి వెళ్తే యాక్షన్ తీసుకోవాలన్నారు. తాను కట్టిన పన్నులతో వేసిన రోడ్డుపై నడిస్తే మీకేం అభ్యంతరమని రేణుకా చౌదరి పోలీసులను ప్రశ్నించారు. ఓ మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ విషయాన్ని గమనించిన రేణుకా చౌదరి పోలీసుల తీరుపై మండిపడ్డారు.

  తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులను రేణుకా చౌదరి నెట్టివేశారు . అదే సమయంలో అక్కడే ఉన్న పంజాగుట్ట ఎస్​ఐ (SI) రేణుకా చౌదరికి అడ్డుపడే ప్రయత్నం చేయడంతో రేణుకా చౌదరి ఎస్ఐ చొక్కా పట్టుకొని నిలదీశారు. ఈ పరిణామంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు కూడా షాక్ తిన్నారు. వెంటనే ఓ మహిళా పోలీస్ రేణుకా చౌదరి చేయిని పంజాగుట్ట ఎస్ఐ చొక్కా నుంచి లాగివేశారు. అనంతరం పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Raj bhawan, Renuka chowdhury, TS Congress

  ఉత్తమ కథలు