పిల్లలు స్కూల్(School)కి వెళ్లడానికి ఇష్టపడకపోతే తల్లిదండ్రులు మందలిస్తారు. లేదంటే నచ్చజెప్పి పంపుతారు. మరీ మారం చేస్తే ఏవైనా కొనిచ్చి దగ్గరుండి మరీ స్కూల్ దగ్గర విడిచిపెట్టి వస్తారు. దాని హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే (Jubilee Hills Former MLA) విష్ణువర్ధన్‌రెడ్డి (Vishnuvardhan Reddy) మాత్రం వీటన్నింటికంటే భిన్నంగా ఆలోచించి తన కూతుర్ని స్కూల్‌కి పంపారు. ఉదయం 8గంటలైంది జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో ఇంట్లో బాజా-భజంత్రీలు మోగుతున్నాయి. ఇంటి ముందు మేళం వాయించే వాళ్లు ఉన్నారు. కొత్త కారును రెడీ చేసి ఉంచారు. ఇదేంటి ఏదైనా పెళ్లి జరుగుతోందని అనుకుంటున్నారు కదూ. కానే కాదు. విష్ణువర్ధన్‌రెడ్డికి 8వ తరగతి చదువుతున్న కూతురు ఉంది. పేరు జనశ్రీరెడ్డి (Janashreereddy). చిరేక్ ఇంటర్నేషన్ స్కూల్ (Chirec International School) లో చదువుతోంది. స్కూల్‌కి వెళ్తుంటే ఈ హడావుడి అంతే ఎందుకుని ఆశ్చర్యపోకండి. గత మూడేళ్లుగా మాజీ ఎమ్మెల్యే పుత్రిక స్కూల్ ముఖం చూడలేదు. కరోనా పుణ్యమా అంటూ ఇంట్లోనే ఆన్‌లైన్ క్లాసుల(Online classes)తో ఆరు, ఏడు తరగతులు పూర్తి చేసింది. ఇప్పుడు కరోనా తగ్గడం, స్కూల్స్ ఓపెన్ కావడంతో జనశ్రీరెడ్డి స్కూల్‌కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రెండేళ్లుగా అలవాటు తప్పడంతో స్కూల్‌కి వెళ్లాలంటే ఆమెలో తెలియని బిడియం, భయం మొదలైంది. ఎక్కడ తన కూతురు స్కూల్‌కి వెళ్లడం మానేస్తుందోనని విష్ణువర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు బ్యాండు మేళాల మధ్య కొత్త కారులో స్కూలుకు సాగనంపారు.
ఇదెక్కడి విడ్డూరం సామి..
స్కూల్‌కి పంపాలంటే ఇంత హడావుడి చేయాలా అని ఆశ్చర్యపోకండి. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఇప్పుడు ఇలాగే అనుకుంటున్నారు. దాంతో వీడియో తెగ వైరల్ అవుతోంది. తన బిడ్డను మేళ, తాళాల మధ్య స్కూల్‌కి పంపుతున్న సమయంలో కాస్త సిగ్గుపడినట్లుగా అనిపించింది తనకైతే మాత్రం జనశ్రీరెడ్డి స్కూల్ యూనిఫామ్‌లో స్కూల్‌కి వెళ్లడం చూసిన తర్వాత హ్యాపీగా ఉందన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే తన కూతుర్ని ఈ విధంగా స్కూల్‌కి పంపాడో చూసిన వాళ్లలో చాలా మంది ఆశ్చర్యపోతుంటే..మరికొందరు కూతురిపై తండ్రికున్న ప్రేమ అంటున్నారు.
స్కూల్‌కి ఇలా కూడా పంపుతారా ..
ఎవరేమనుకుంటే ఏంటి చదువు చెప్పించడం కోసం..స్కూల్‌కి పంపించడానికి తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడం, తిట్టడం కంటే ఈ పద్ధతి బాగానే ఉందంటున్నారు సోషల్ మీడియా ఫాలోవర్స్. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి తన కూతుర్ని ఆ విధంగా స్కూల్‌కి పంపించడం ఒక విధంగా సరైనదేనంటూ సమర్ధిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Viral Video, Vishnu Vardhan