బీజేపీ(BJP) నేత, మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ (Babu Mohan)తన నోటి దురుసుతో మరోసారి వార్తలెక్కారు. టీఆర్ఎస్(TRS) నుంచి బీజేపీలోకి చేరిన బాబు మోహన్ పార్టీలో కింది స్థాయి నేతల్ని కలుపుకొని వెళ్లాల్సింది పోయి...పార్టీలో మీతో పాటు కలిసి పని చేస్తామని కోరిన ఆందోల్‌కు చెందిన కార్యకర్త వెంకటరమణను బండ బూతులు తిట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మీతో కలిసి పని చేస్తానని ఓ కార్యకర్త ఫోన్(Phone) చేసి బాబు మోహన్‌ని అఢిగితే నువ్వెంతా నీ బతుకెంతా అని దుర్భాషలాడటమే కాకుండా తాను ప్రపంచ స్థాయి నాయకుడ్ని అంటూ అతనిపై తిట్ల దండకం చదివారు. ఓ సాధారణ కార్యకర్త ఫోన్ చేస్తే బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకుడు స్పందించిన తీరుతో ఖంగుతిన్న సదరు బాధితుడు ఫోన్ వాయిస్ రికార్డ్(Phone Voice Record)చేయడంతో ఇప్పుడు బాబు మోహన్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
బీజేపీలో బాబు మోహన్ రచ్చ..
అంతే కాదు సదరు వ్యక్తిని మరోసారి నాకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ బెదిరించిన బాబు మోహన్ బండి సంజయ్ ఎవడ్రా, వాడు నా తమ్ముడని ఏకవచనంతో మాట్లాడటం ఫోన్ వాయిస్‌లో స్పష్టంగా రికార్డైంది. అంతటితో ఆఘకుండా అవసరమైతే రేపే బీజేపీకి రాజీనామా చేస్తానన్న బాబుమోహన్...నువ్వు కావాలో, నేను కావాలో పార్టీ తేల్చుకుంటుందని కామెంట్స్ చేయడంపై బీజేపీ శ్రేణులు సైతం మండిపడుతున్నారు.
కార్యకర్తను చెప్పుతో కొడతానంటూ వార్నింగ్..
మంత్రిగా పని చేసిన ఓ నాయకుడు, జాతీయ పార్టీలో రాష్ట్ర స్ధాయి నేతగా ఉండి..కార్యకర్తలను దుర్భాషలాడటం, కింది స్థాయి శ్రేణులను ఇంత చులకన చేసి మాట్లాడటం ఏమిటనే చర్చ మొదలైంది. అంతే కాదు గతంలో కూడా అంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు బాబు మోహన్.
బండి సంజయ్‌ని చులకన చేస్తూ వ్యాఖ్యలు.,.
గతంలో బీఆర్ఎస్‌లో గెలిచి మంత్రి పదవి అనుభవించిన బాబు మోహన్ ..నోటి దురుసుతో పాటు నియోజకవర్గ ప్రజల్లో అభిమానం దక్కించుకోలేకపోవడం, పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకపోవడం వల్లే బీఆర్ఎస్‌కు దూరమయ్యారు. ఇప్పుడు జాతీయ స్థాయి పార్టీలో ఉంటూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్ర పెద్దలు సైతం ప్రయత్నిస్తుంటే బాబు మోహన్ మాత్రం ఇంత రివర్స్‌గా మాట్లాడం ఏమిటని ఆలోచిస్తున్నారు. అయితే బాబు మోహన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? వైరల్ అవుతున్న ఫోన్ వాయిస్‌పై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babu Mohan, Telangana Politics