రెండక్షరాల పెళ్లి(Marriage) వెనుక ఎంతో కష్టం ఉటుంది. ఎంతో మంది ఆశీర్వాదాలు ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటారు. పెళ్లి మండపం వద్ద మంత్రాలు పటించే పంతులు ఎన్నో వేదమంత్రాలు చదువుతాడు. ఆ మంత్రాల్లో ప్రతీ ఒక్క పదానికి నిగూడమైన అర్థం దాగి ఉంటుంది. అయితే పెళ్లి చేసుకుకోవాలంటే యువతి, యువకుడికి ఎంత వయస్సు ఉండాలనే విషయంపై భారత ప్రభుత్వం (Indian Government) చట్టం చేసిన విషయం తెలిసిందే. ఇలా భారత్‌లో వివాహం చేసుకోవాలంటే చట్టప్రకారం అమ్మాయికి కనీసం 18 ఏళ్లు ఉండాలి. అబ్బాయికి 21 ఏళ్లు నిండాలి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కనీస వివాహ వయసులు స్త్రీ, పురుషులకు భిన్నంగా ఉన్నాయి. కనీస వయసు అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఎక్కువగా ఉండాలన్న దేశాలైతే దాదాపు లేనే లేవు.
భారత్‌లో స్త్రీ, పురుషులుకు మేజర్ అయ్యే వయసు ఒక్కటే అయినప్పటికీ, పెళ్లి విషయంలో మాత్రం తేడా ఉండటం గమనార్హం. ఇద్దరి మధ్య వయస్సు గ్యాప్ అనేది ఎందుకు ఉండాలనే దానిపై ఇటీవల దిల్లీ హైకోర్టు ఇలా చెప్పింది. అమ్మాయిలకు, అబ్బాయిలకు కనీస వివాహ వయసును సమానంగా నిర్ణయించాలని అందులో ఆయన అభ్యర్థించారు.
వయసు అంతరం ఉండాలనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలూ లేవని, పితృస్వామిక ఆలోచనల ప్రతిఫలంగానే ఆ తేడా వచ్చిందని అన్నారు. ఇదంతా ఇలా ఉండగా.. దేశంలో ఎక్కడైనా పెళ్లి చేసుకోవలంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉండాలి. అలా కాకుండా ఇటీవల కొన్ని ఘటనలు దానికి విభిన్నంగా జరుగుతున్నాయి. ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకుని ఒక్కటవుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
అయితే తాజాగా అలాంటి సంఘటన హైదరాబాద్ లోనే చోటు చేసుకుంది. అంతే కాకుండా ఇద్దరు పురుషులు స్వలింగ సంపర్కులు(గే) పెళ్లి చేసుకుని ఒక్కటవ్వడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుప్రియో మరియు అభయ్ అనే ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య పరిచయం ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. వీరిద్దరు కూడా హైదరాబాద్ కు చెందినవారు. ఇలా వాళ్లిద్దరు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు ముందుగా స్నేహితులుగా పరిచయం చేసుకొని..ఒకరినొకరు అర్థం చేసుకొని చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
విశేషం ఏంటంటే.. వీరిద్దరి పెళ్లికి వాళ్ల తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారట. ఇలా వాళ్లిద్దరు కలిసి వారి తల్లిదండ్రులను ఒప్పించారు. ఇక పెళ్లికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇక హిందూ పంప్రదాయం ప్రకారం వివాహం ఎలా జరుగుతుందో అలా చేసుకోబోతున్నారు. మంగళస్నానాలు, ఉంగరాలు మార్చుకునే కార్యక్రమాలు కూడా ఉండనున్నాయి. వీరి వివాహం అంగరంగ వైభోగంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.