HYDERABAD FOOD INSPECTOR FINED FOR RESTAURANT IN BANDLAGUDA HYDERABAD DUE TO SALE STORED CHICKEN AND MUTTON VB
Stored Chicken-Mutton: చికెన్, మటన్ కోసం వెళ్తున్నారా.. కాస్త ఆగండి.. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి..
కుళ్లిన చికెన్, మటన్
Stored Chicken-Mutton: దేశ రాజధానిలో ఆదివారం వచ్చిందంటే చాలా చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలోన్లు కనిపిస్తుంటాయి. అంత మక్కువ చూపిస్తారు నగరవాసులు. అయితే తాజాగా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి.
రాష్ట్ర రాజధానిలోనే కాదు తెలంగాణ (Telangana) లోని ప్రతీ జిల్లాలో ఆదివారం వచ్చిందంటే చాలా చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలోన్లు కనిపిస్తుంటాయి. అంత మక్కువ చూపిస్తారు నగరవాసులు. అయితే కొన్ని రోజుల క్రితం అధికారుల తనిఖీల్లో కొన్ని భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి. వవ్యాపారులు స్వలాభం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మేకపోతు అంటూ.. మేకల మాంసం, కోడి మాంసానికి రంగులు వేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా రంగులు వేయని కోడి మాంసం దొరికే పరిస్థితి లేదంటే అతిశయోక్తికాదు.
దాదాపు వ్యాపారులందరు కోడి మాంసానికి రంగులు వేసి మసి పూసి మారేడుకాయ చేసి నాలుగు పైసలు వెనకేసుకోవడానికే ఆశపడుతున్నారు. ఈ రంగుల వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారనే ధ్యాస కూడా లేకుండా ఇష్టానుసారంగా వ్యాపారం చేశారు. తర్వాత వాళ్లపై అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. తజాగా మరో భయంకరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఓ హోటల్ యజమాని.. రోజుల తరబడి నిల్వ ఉంచిన పురుగులు, బూజుపట్టిన మాంసం వండి పెడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బండ్లగూడజాగీర్ నగరపాలక సంస్థ పరిధిలో వెలుగు చూసింది.
బండ్లగూడజాగీర్ కూడలిలోని పెట్రోలు బంకు పక్కన గల ఓ రెస్టారెంట్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫ్రిజ్‌లో బూజుపట్టిన మాంసం, పురుగులు పట్టిన చికెన్ దర్శనమిచ్చాయి. రెండు రోజుల కిందటి బిర్యానీని తిరిగి వేడి చేసి పెడుతున్నట్లు గుర్తించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గౌరిశెట్టి మనోహర్ వాటిని… నాణ్యత పరిశీలన కోసం సేకరించారు. కస్టమర్లకు వేడి చేసి అందిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హోటల్‌కు జీహెచ్ఎంసీ అధికారులు రూ.5వేల జరిమానా విధించారు.
అంతే కాకుండా ఇకముందు ఇలాంటివి జరిగితే హోటల్ సీజ్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఇక హైదరబాద్ లో కల్తీ మాంసం విక్రయాలపై బల్దియా దృష్టి పెట్టింది. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూసిన నేపథ్యంలో నగర పౌరులను అధికారులు అలర్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో వేలాదిగా మాంసం దుకాణాలు నడుస్తున్నాయని గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఇటీవల పలు షాపులపై దాడులు చేసిన అధికారులు.. ఆ దాడుల్లో పాడైన, కల్తీ మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన మాంసాన్నే కొనుగోలు చేయాలని నగర పౌరులకు అధికారులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.