Hyderabad Floods: సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం ప్రకటించిన మేఘా కంపెనీ

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: October 19, 2020, 8:04 PM IST
Hyderabad Floods: సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం ప్రకటించిన మేఘా కంపెనీ
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్
  • Share this:
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు మేరకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(MEIL) భారీ విరాళం ప్రకటించింది. వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన మేఘా సంస్థ రూ. 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు. ఈ మేరకు మేఘా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు మద్దతుగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు మేఘా యాజమాన్యం తెలిపింది. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరం భారీ వరదలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. బాధ్యత గల కార్పొరేటు సంస్థగా, రాష్ట్ర ప్రభుత్వానికి, హైదరాబాద్ ప్రజలకు సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలిపింది.

ఇప్పటికే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి రూ. 10 కోట్ల రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కోరితే మరే ఇతర సహాయం చేయడానికైనా తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.

Megha Engineering and Infrastructures Limites, Meil Announced Rs 10 crore To Telangana CMRF, Meil Announced Rs 10 crore Donation, Hyderabad rains, Hyderabad Floods, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్, మేఘా కంపెనీ భారీ విరాళం, పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన మేఘా కంపెనీ, హైదరాబాద్ వర్షాలు, హైదరాబాద్ వరదలు
మేఘా సంస్థ విడుదల చేసిన ప్రకటన


కాగా, తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలతో భారీగా ఆస్తి నష్టంతో పాటుగా, పలు చోట్ల ప్రాణ నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. నగరంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరదనీటిలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో.. నగరవాసులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
Published by: Sumanth Kanukula
First published: October 19, 2020, 5:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading