CM KCR: హైదరాబాద్‌లో చెరువుల పరిశీలన కోసం 15 బృందాలు

Hyderabad Floods: ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి ముందు జాగ్రత్తలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

news18-telugu
Updated: October 21, 2020, 4:50 PM IST
CM KCR: హైదరాబాద్‌లో చెరువుల పరిశీలన కోసం 15 బృందాలు
సీఎం కేసీఆర్
  • Share this:
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ పరిధిలోని చెరువులన్నీ పూర్తిస్థాయిలో నిండాయి. ఇప్పటికే కొన్ని చెరువులకు గండ్లు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలో నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌తో చర్చించారు. చెరువులన్నీ నిండిపోయి ఉండడంతో పాటు, చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున కట్టలకు గండిపడడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.

కాబట్టి నీరుపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని, కట్టల పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. నగరంలోని వరద నీటితో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారాకూడా చాలా నీరు నగరంలోని చెరువులకు చేరిందని అన్నారు. ఈ నేపధ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి ముందు జాగ్రత్తలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్న చోట, గండ్లు పడే అవకాశం ఉన్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలని... వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: October 21, 2020, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading