Hyderabad Floods: చాంద్రాయణగుట్ట వద్ద మరో మృతదేహాం లభ్యం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం వణికిపోయింది. భారీగా వరద నీరు చేరడంతో చాలా కాలనీలు నీట మునిగాయి.

news18-telugu
Updated: October 19, 2020, 8:27 PM IST
Hyderabad Floods: చాంద్రాయణగుట్ట వద్ద మరో మృతదేహాం లభ్యం
భారీ వర్షాలకు జలమయంగా మారిన రోడ్లు
  • Share this:
గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం వణికిపోయింది. భారీగా వరద నీరు చేరడంతో చాలా కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. వర్షాలు కారణంగా భారీగా ఆస్తి నష్టంతో పాటుగా, పలుచోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇళ్ల గోడలు కూలి, వరదల్లో కొట్టుకుపోయి, విద్యుత్ షాక్‌తో చనిపోయినవారు పదుల సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు 70 మంది మృతిచెందినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 మంది చనిపోయారని చెప్పారు. అయితే వరద నీటిలో పడి గల్లంతైన వారి మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మూడు రోజుల క్రితం గగన్‌పహాడ్‌లో వరదకు కొట్టుకుపోయిన 7 ఏళ్ల మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఫంక్షన్‌హాల్‌ వద్ద చెట్ల పొదల్లో అయాన్‌ మృతదేహాన్ని గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు.

తాజాగా వరదల్లో కొట్టుకువచ్చిన ఓ వ్యక్తి మృతదేహాన్ని చాంద్రాయణగుట్ట వద్ద అధికారులు గుర్తించారు. అయితే అది ఎవరి మృతదేహాం అన్నది తెలియాల్సి ఉంది. ఆ మృతదేహం ఎవరిదో తెలుసుకోవడానికి ఎగువ ప్రాంతాల్లో వరదల్లో గల్లంతైనా వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇక, హైదరాబాద్‌లోని చాలాచోట్ల నేడు కూడా భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చాంద్రాయణ గుట్ట, సంతోష్‌నగర్, బాలాపూర్‌, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, కోఠి, ఎంజే‌ మార్కెట్, పురాణాపూల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, తార్నాక, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే నగరంలో సుమారు 200 కాలనీలు వరదముంపులో ఉండటం.. మళ్లీ వర్షాలు పడుతుండటం నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది.

ఇక, ఇదిలా ఉంటే తెలంగాణకు మరోసారి భారీ వర్షం పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు చాలా చోట్ల, రేపు మరియు ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
Published by: Sumanth Kanukula
First published: October 19, 2020, 8:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading