హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన.. వరద బాధితులు మీ సేవ సెంటర్లకు రావాల్సిన అవరసం లేదు

Hyderabad: జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన.. వరద బాధితులు మీ సేవ సెంటర్లకు రావాల్సిన అవరసం లేదు

రూ. 10వేల వరద సాయం కోసం మీ సేంటర్ వద్ద బారులు తీరిన బాధితులు

రూ. 10వేల వరద సాయం కోసం మీ సేంటర్ వద్ద బారులు తీరిన బాధితులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో రూ. 10 వేల సాయం అందని వరద బాధితులు మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే అలాంటి వారికి జీహెచ్‌ఎంసీ కీలక సూచన చేసింది.

  జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో రూ. 10 వేల సాయం అందని వరద బాధితులు మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే అలాంటి వారికి జీహెచ్‌ఎంసీ కీలక సూచన చేసింది. వరద బాధితులు మీసేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జయ చేయనున్నట్టు వెల్లడించారు. బాధితుల ధ్రువీకరణ పూర్తయ్యాక ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సాయం అందని బాధితుల వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితులు మీ సేవల సెంటర్ల చుట్టూ తిరుగొద్దని కోరారు.

  హైదరాబాద్‌లో వరద ముంపుకు గురైన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు పాటు వరద సాయం పంపిణీ చేశారు. ఇందుకోసం బాధితుల మీ సేవా కేంద్రం జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్ రావడంతో దానిని నిలిపివేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత సాయం అందనివారికి రూ. 10 వేలు అందజేయనున్నట్టు తెలిపింది.

  Hyderabad Flood relief financial assistance to be transferred directly to accounts says GHMC officials-జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో రూ. 10 వేల సాయం అందని వరద బాధితులు మీ సేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే అలాంటి వారికి జీహెచ్‌ఎంసీ కీలక సూచన చేసింది.
  సాయం కోసం మీ సేవ సెంటర్ల వద్ద వరద బాధితులు

  అయితే తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మరోసారి వరద బాధితులు మీ సేవ సెంటర్ల మందు బారులు తీరారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. బాధితులకు వరద సాయం అందజేయాలని కోరుతున్నారు. మీ సేవ సెంటర్ల వద్ద భారీగా జనాలు చేరుకోవడంతో.. పలుచోట్ల మీ సేవ సెంటర్లను నిర్వాహకులు మూసివేస్తున్నారు. ఇక, వరద సాయం కోసం వచ్చినవారిని పోలీసులు ఇళ్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాధితులు మాత్రం తమకు వెంటనే సాయం అందించాలని ఆందోళ చేస్తున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: GHMC, Hyderabad, Hyderabad Floods

  ఉత్తమ కథలు