హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద శుక్రవారం కలకలం రేగింది. ఒకే రోజు వేర్వేరు సంరదర్భాల్లో నలుగురు మహిళలు, ఓ యువతి ట్యాంక్ బండ్ వద్ద ఆత్మహత్యకు యత్నించారు. హుస్సేన్ సాగర్‌లో దూకి చనిపోవాలని అనుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన లేక్ పోలీసులు వీరిని ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నారు. అయితే ఆత్మహత్యకు యత్నించిన ఐదుగురు కూడా వివిధ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు మహిళలు భర్త వేధింపులు తాళలేక డిప్రేషన్‌తో ఆత్మహత్యకు యత్నించారు. ఆర్థిక సమస్యలతో ఒకరు, ప్రేమ విఫలమైందని ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలని చూశారు. మరో మహిళ మద్యానికి బానిసై కుటుంబ సమస్యలతో ఆత్మహత్య యత్నం చేసింది.
ఆత్మహత్యకు యత్నించిన ఈ ఐదుగురు మహిళలను కాపాడిన లేక్ పోలీసులు.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలా ఒకే రోజు ఐదుగురు మహిళలు ఆత్మహత్యకు యత్నించడం ట్యాంక్ బండ్ వద్ద కలకలం రేపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.