Home /News /telangana /

HYDERABAD FIVE STUDENTS ARRESTED FOR GANG RAPING MINOR GIRL AT KARKHANA IN HYDERABAD SNR

OMG : జూబ్లిహిల్స్ తరహాలోనే కార్ఖానాలో.. మైనర్‌ బాలికపై 2నెలలుగా ఐదుగురు స్టూడెంట్స్ అత్యాచారం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

OMG: జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో దోషుల్ని గుర్తించేలోపే హైదరాబాద్ కార్ఖానాలో మరో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ఐదుగురు కుర్రాళ్లు రెండు నెలలుగా అత్యాచారం చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండగా..ఐదుగుర్ని ఈనెల 2వ తేదిన అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఇంకా చదవండి ...
హైదరాబాద్‌(Hyderabad)జూబ్లిహిల్స్‌లో జరిగినట్లుగానే కార్ఖానా(Karkhana)లో కూడా మైనర్‌(Minor girl) బాలిపై సామూహిక అత్యాచారం() జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహం ముసుగులో 15ఏళ్ల బాలిక(15Years)ను ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పరిచయం చేసుకున్న ఐదుగురు కామాంధులు రెండు నెలలుగా సామూహిక అత్యాచారానికి(Gang rape) పాల్పడ్డారు. బాలిక మానసీకంగా కుంగిపోవడం, పదే పదే ఇంట్లోంచి చెప్పపెట్టకుండా బయటకు వెళ్లడం గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో దారుణం బయటపడింది.

జూబ్లిహిల్స్ తరహా ఘటన..
15సంవత్సరాల బాధితురాలిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం చేసుకున్నారు కార్ఖానాకు చెందిన యువకులు. ఆమెతో మంచిగా ఉంటూ... మాటలతో మచ్చిక చేసుకున్నారు. అటుపై బయటకు రావాలని కారులో తీసుకెళ్లారు. ఆ క్రమంలోనే ఆమెపై కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను అత్యాచారం చేస్తూ వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్ చేశారు. అంతటితో ఆగకుండా లాడ్జీలకు తీసుకెళ్లి మరో ముగ్గురు స్నేహితులతో అత్యాచారం చేయించారు. బాధితురాలు మైనర్ కావడంతో విషయాన్ని ఎవరికి చెప్పలేకపోయింది. దీంతో కామాంధులు గత రెండు నెలలుగా ఓ మైనర్‌ బాలికను చెరబట్టారు.

ఇది చదవండి : ఖమ్మం జిల్లాలో పెళ్లి చేసుకున్న 48గంటల్లోనే గొంతుకోసుకున్న పెళ్లి కొడుకు .. ఎందుకంటేరెండు నెలలుగా అరాచకం..
బాధిత బాలిక ఇంట్లో ముబావంగా ఉండటం, పదే పదే ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లడం గమనించిన తల్లిదండ్రులు ఆమెను నిలదీయడంతో నిజం చెప్పింది. దాంతో బాలిక తల్లిదండ్రులు మే 30వ తేదిన కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. బాలికకు భరోసా సెంటర్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు షాకింగ్ న్యూస్‌ రాబట్టారు. నిందితులు అంతా కార్ఖానా, వనస్థలిపురం, సైఫాబాద్‌, ఎల్బీనగర్, పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఇద్దరు మైనర్లు కాగా..ముగ్గురు మేజర్లుగా తేల్చారు.మైనర్‌ పై ఐదుగురు అత్యాచారం..
సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని మైనర్‌ బాలికపై రెండు నెలలుగా అత్యాచారం చేసిన ఐదుగురు కామాంధుల్లో సైఫాబాద్‌కి చెందిన మైనర్ టెన్త్ క్లాస్ చదువుతుండగా మరకొరు వనస్థలిపురానికి చెందిన వాడిగా గుర్తించారు . అతను ఇంటర్ సెకండ్ ఈయర్ చదువుతున్నాడు. వీళ్లిద్దరే బాలికను నమ్మించి పలుమార్లు కారులో బయటకు తీసుకెళ్లినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో రాబట్టారు.

ఇది చదవండి : వివాహేతర సంబంధం పెట్టుకున్న వృద్ధుడి హత్య ..మంత్రగాడనే అనుమానంతోనే ఘాతుకంఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వల ..
బాధితురాలిపై అత్యాచారం చేసిన వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశారు ఇద్దరు నిందితులు.అటుపై తమస్నేహితులైన ఎల్బీనగర్‌కి చెందిన రిషబ్, పటాన్‌చెరుకు చెందిన సాయి చైతన్య, శౌర్య అనే మరో డిగ్రీ స్టూడెంట్స్‌తో కలిసి ఐదుగురు బాధితురాలిపై అనేక సార్లు అత్యాచారం చేశారు. ఎల్బీనగర్‌, చైతన్యపురిలోని వేర్వేరు లాడ్జిలకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు రాబట్టారు. నేరం చేసిన ఐదుగురు నిందితుల్ని ఈనెల 2వ తేదిన అరెస్ట్ చేశారు. మేజర్లను చర్లపల్లి జైలుకు తరలించారు. మైనర్‌లను జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలికి మెడికల్, మానసీక వైద్యుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. జూబ్లిహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు కలకలం రేపడంతో కార్ఖానాలో జరిగిన గ్యాంగ్‌ రేప్ కేసులో పోలీసులు వెంటనే దోషుల్ని పట్టుకున్నట్లుగా అర్ధమవుతోంది.

ఇది చదవండి : నేరం చేయకుండానే జైలు భోజనం తినాలంటే .. నిజామాబాద్‌ వెళ్లాల్సిందే


Published by:Siva Nanduri
First published:

Tags: Gang rape, Greater hyderabad, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు