నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ... నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీగా ఏర్పాట్లు

Krishna Kumar N | news18-telugu
Updated: June 8, 2019, 5:46 AM IST
నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ... నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీగా ఏర్పాట్లు
చేప మందు ప్రసాదం పంపిణీ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: June 8, 2019, 5:46 AM IST
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి ప్రజలు తరలివస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచీ ఇచ్చే చేప ప్రసాదం తీసుకునేందుకు ఉదయం నుంచే ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ ప్రసాదం కోసం వేల మంది దేశ విదేశాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి వచ్చారు. ఇలా వచ్చే వారి కోసం రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల దగ్గర ప్రత్యేకంగా వాహనాలను అందుబాటులో ఉంచారు. ఈ సమాచారాన్ని అందజేసేందుకు మే ఐ హెల్ప్ బూత్‌లను నెలకొల్పారు. అలాగే వసతులు కల్పించేందుకూ, చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా జరిగేందుకు 14 మంది తహశీల్దార్లు, ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రతి ఒక్కరి కదలికలను గమనించేందుకు 60 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. GHMC కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ... 100 మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచింది. గ్రౌండ్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేందుకు ప్రత్యేక బృందాల్ని నియమించింది. మూడున్నర లక్షల మందికి సరిపోయేలా వాటర్ ప్యాకెట్లు కూడా రెడీ చేశారు.

చేప ప్రసాదానికి అవసరమైన లక్షా 60వేల కొర్రమీను చేపల్ని తెలంగాణ జిల్లాల నుంచీ తెప్పించారు. చేపల పంపిణీ పనిలో 340 మంది ఉన్నారు. చేప పిల్లలు బతికి ఉండేందుకు ప్రత్యేక కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకూ చేప మందు ప్రసాదం పంపిణీ జరగనుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని 36 కౌంటర్లలో ఈ ప్రసాదాన్ని పొందొచ్చు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో సూచిక బోర్డుల్ని ఏర్పాటుచేశారు.

- రోగులు, సహాయకుల కోసం రూ.5 భోజన కౌంటర్లు, బద్రివిశాల్ పన్నాలాల్ ట్రస్ట్, అగర్వాల్‌ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్, హైదరాబాద్ జైశ్వాల్‌సేవా సమితిలతో ఉచితంగా టిఫిన్లు, భోజనాలు పెట్టబోతున్నారు.

- రద్దీని తెలుసుకొనేందుకు 4 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు.


- ఆరు వైద్య బృందాలు, 3 ఫైర్ ఇంజిన్లు, 3 బుల్లెట్ ఫైర్ ఇంజిన్లు, ఫైర్ కంట్రోల్ రూంలున్నాయి.
- ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి హైదరాబాద్‌లోని 14 ట్రాఫిక్ హబ్‌ల నుంచి 150 ఆర్టీసీ బస్సులను ఏర్పాటుచేశారు
- ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పొందలేకపోతే, మర్నాడు హైదరాబాద్‌లోని 4 ప్రాంతాల్లో ఉచితంగా ప్రసాదం ఇస్తారు.
First published: June 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...