హోమ్ /వార్తలు /తెలంగాణ /

Transgenders Clinics: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక హాస్పిటల్స్.. దేశంలోనే మొదటిసారి.. ఎక్కడో తెలుసా..?

Transgenders Clinics: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక హాస్పిటల్స్.. దేశంలోనే మొదటిసారి.. ఎక్కడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Trans genders: ట్రాన్స్ జెండర్లు. ప్రస్తుత సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వర్గం. విద్య, ఉద్యోగం, సమాజంలో గౌరవం, విలువ లాంటి వాటిలో ఎక్కడికెళ్లినా వీరికి వివక్ష ఎదురవుతోంది.

ట్రాన్స్ జెండర్లు. ప్రస్తుత సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వర్గం. విద్య, ఉద్యోగం, సమాజంలో గౌరవం, విలువ లాంటి వాటిలో ఎక్కడికెళ్లినా వీరికి వివక్ష ఎదురవుతోంది. కొన్ని సందర్భాల్లో ఛీత్కారాలు కూడా పడాల్సి వస్తోంది. అలాంటి వారు ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకునేందుకు కూడా అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఐతే ట్రాన్స్ జెండర్ల విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. వారికి రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కొన్ని రాష్ట్రాలు పెన్షన్లు కూడా అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండ‌ర్ల‌తో నడిచే రెండు క్లినిక్‌ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైద‌రాబాద్‌లో మొదటిసారి ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా పనిచేసే హాస్పిటళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రాన్స్‌జెండ‌ర్ క్లినిక్‌లు హార్మోన్ థెరపీ, లింగ ధ్రువీకరణ, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్‌ వంటి ఆరోగ్య సేవలను అందిస్తాయి. లింగమార్పిడి చేయించుకున్న వారి సంక్షేమం కోసం ట్రాన్స్‌జెండ‌ర్ల సంక్షేమ చట్టం-2019ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.

ఈ చట్టం ప్రకారం ప్రతి మెట్రో సిటీలో రెండు ట్రాన్స్‌జెండ‌ర్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మొదటగా చొరవ తీసుకొని.. హైద‌రాబాద్‌లో రెండు ట్రాన్స్‌జెండ‌ర్ క్లినిక్‌లు ప్రారంభించింది. 2021లో రెండు క్లినిక్‌లను ప్రారంభించగా.. మొదటిది నారాయణగూడలో జనవరి 29న ప్రారంభించారు. రెండో హాస్పిటల్ జూలై 11న జీడిమెట్లలో ప్రారంభించారు. ఈ క్లినిక్‌లలో ట్రాన్స్‌జెండర్ డాక్టర్లు, కౌన్సిలర్లు, సైకాలజిస్టులు ఇతర సిబ్బంది పనిచేస్తారు. వీరంతా కూడా ట్రాన్స్‌జెండర్లే.. కాగా చికిత్స మాత్రం అన్ని వర్గాల ప్రజలకు అందిస్తారు. హిజ్రా, ట్రాన్స్ మెన్, క్రాస్ డ్రెస్స‌ర్స్, లింగ నిర్ధార‌ణ కాని వారికి, జోగినీలు, శివ‌శ‌క్తుల‌కు కూడా ట్రీట్ మెంట్ ఉంటుంది.


ట్రాన్స్ కార్య‌క‌ర్త ర‌చ‌న ముద్ర‌బోయిన కొత్తగా ప్రారంభించిన క్లినిక్‌ల గురించి మాట్లాడారు. హైదరాబాద్‌లో హెచ్ఐవీ ప్రాబల్యం ఎక్కువగా ఉండటం వల్ల.. ఇక్కడే తొలి ట్రాన్స్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. హైద‌రాబాద్‌ ట్రాన్స్‌జెండ‌ర్ల క‌మ్యూనిటీలో హెచ్ఐవీ ప్రాబ‌ల్యం 6.47% గా ఉందని ఆమె వెల్లడించారు. భారతదేశ ట్రాన్స్‌జెండ‌ర్లలో హెచ్ఐవీ ప్రాబ‌ల్యం స‌రాస‌రి 3.13 శాతంగా ఉందని ఆమె తెలిపారు.

2030 నాటికి హెచ్ఐవీ వ్యాధిని నిర్మూలించాలనే ధ్యేయంతో యూనైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌నల్ డెవ‌ల‌ప్‌మెంట్ (USAID), నేష‌న‌ల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ (NACO) పనిచేస్తున్నాయని ఆమె అన్నారు. USAID మిషన్ లక్ష్యాలను సాధించేందుకు హైదరాబాద్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ క్లినిక్ సమర్థవంతంగా పని చేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. హెచ్ఐవీ నిర్మూలనకు చికిత్స అందించడంతో పాటు ఆంటీరిట్రోవైర‌ల్ థెర‌పీ చికిత్స‌లు కూడా తాము అందిస్తామని ఆమె తెలిపారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఆర్థిక స్థితిని, శ్రేయస్సును క్లినిక్ సంరక్షిస్తుందని ఆమె తెలిపారు.

First published:

Tags: Hyderabad, Telangana, Transgender

ఉత్తమ కథలు