హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం ..

Hyderabad: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం ..

Secretariat fire

Secretariat fire

New Secretariat: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరగడంతో గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరగడంతో గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సుమారు 11ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. సెక్రటేరియట్‌లో వుడ్‌ వర్క్స్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ మంటలు చెలరేగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో ఈ అగ్నిప్రమాదం జరగడంతో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఈనెల 17వ తేదిన కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.

Rajanna Sircilla: సీఎం కేసీఆర్‌పై అభిమానం..కేటీఆర్‌కు అద్భుతమైన కానుక ఇచ్చిన యువకుడు 

చకచక పనులు..

ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్ పుట్టిన రోజు. కేసీఆర్ పుట్టిన రోజునే కొత్త సచివాలయ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు.సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను 10 రోజుల్లోనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బీహర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ , జేడీ(యు) అద్యక్షుడు లలన్ సింగ్ , అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ లు హజరు కానున్నారు.

అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం..

తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా యుద్ధనౌక గద్దర్ సీఎం కేసీఆర్‌ను కోరారు.ఈ మేరకు తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ భవన్ గా నామకరణం చేసింది ప్రభుత్వం.

First published:

Tags: Telangana new secretariat, Telangana News

ఉత్తమ కథలు