సినీ నటుడు ఆలీ షడన్‌గా హైదరాబాద్(Hyderabad)లోని రాజభవన్‌లో కనిపించారు. అదేంటి ఆయనకు ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)ప్రభుత్వం కదా పదవి ఇచ్చింది..మరి తెలంగాణ రాజ్‌భవన్‌లో ఏం పని అక్కడున్న వాళ్లంతా అనుకున్నారు. అయితే ఆలీ(Ali)రాజ్‌భవన్‌కి వచ్చి గవర్నర్ మేడమ్ తమిళిసై సౌందర్‌రాజన్(Tamilisai Soundarajan)ని కలవడానికి గల కారణాలు తెలిపారు. ఆలీ పెద్ద కూతురు ఫాతిమా(Fathima)వివాహం నిశ్చమైంది. త్వరలోనే ఆ వివాహం జరగనుంది. ఆ పెళ్లికి ఆహ్వానించి వివాహ పత్రిక అందజేయడానికి ఆలీ రాజన్‌భవన్‌కి వచ్చారు.
రాజ్‌భవన్‌లో నటుడు ఆలీ..
సినీ నటుడు, ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుడు ఆలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ని కలిశారు. త్వరలోనే తన పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఉన్నందున ఆ పెళ్లి వేడుకకు గవర్నర్‌ను ఆహ్వానించారు. ముందుగా తమిళిసై గౌరవప్రదంగా కలిసి ముచ్చటించారు. అనంతరం అలీ వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ స్వయంగా వివాహానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లిపత్రిక స్వీకరించిన తమిళిసై కూడా, తప్పకుండా వివాహానికి హాజరు అవుతాను అని అలీకి మాటిచ్చారు.
వివాహానికి ఆహ్వానించడానికి..
అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది.అక్టోబర్ 25వ తేదిన హైదరాబాద్‌లో ఎంగేజ్‌మెంట్ కూడా చాలా గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి పనులు సాంప్రదాయ పద్ధతిలో ఇరుకుటుంబాల సభ్యుల సమక్షంలో దగ్గరుండి నిర్వ హిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆలీకి పదవి వస్తుందని ఆశించిన నేపధ్యంలో ప్రభుత్వం ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించింది. ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు.
పదవి..పలుకుబడి ..
ఓవైపు సినీ నటుడుగా మరోవైపు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బిజిగా ఉన్నారు ఆలీ. మరోవైపు ఏపీ ప్రభుత్వం పదవి అప్పగించడంతో ఆలీ ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోంది. ఈ వివాహ వేడుకకు కూడా అటు సినీరంగానికి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి వాళ్లు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Telangana News