HYDERABAD FIGHT WITH SPIRIT OF PM MODI IN SC CONSTITUENCIES IN TELANGANA BANDI SANJAY VRY HYD
Bandi Sanjay : రాష్ట్రంలో మిషన్ -19 ఆ.. నియోజవర్గాల్లో కూడా బీజేపీకి బలం..
Bandi-Sanjay-Kumar bjp sate president
Bandi Sanjay : రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్రంగా వ్యతిరేకత ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.. ఆ స్థానాల్లో గెలుపు పార్టీ కార్యకర్తలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మిషన్ 19 పేరుతో చేపట్టిన సమీక్షలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు.
తెలంగాణలో ఉన్న మొత్తం 19 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు కృషి చేయాలని, అందుకు కార్యచరణ రూపోందించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన "ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి" పై "మిషన్ -19" పేరుతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా బీజేపీని చూస్తున్నారని అన్నారు. దీన్ని పార్టీకి అనుకూలంగా మల్చుకుని తగిన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ఇక పార్టీ అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాలు సైతం అంత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అందుకే అక్కడ గెలుపొందేందుకు రాష్ట్ర పార్టీ సైతం ప్రణాళిక రూపొందించిందని చెప్పారు.
ఇక ఇటివల పార్టీ నిర్వహించిన సర్వేలో సైతం ఎస్సీ నియోజవర్గాల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, మరోవైపు స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా ఉందని చెప్పారు. సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 19 ఎస్సీ రిజర్వుడు నియోజకర్గాల్లో పార్టీ గెలుపొందనుందని చెప్పారు. ముఖ్యంగా దళితులకు ఇచ్చిన హామిలు నెరవేర్చడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు.
మరోవైపు దళితుల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్రమోది కృషి చేస్తున్నారని, అందుకు నిదర్శనమే దేశవ్యాప్తంగా 46 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. ఇక మోదీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని దేశ ప్రజలు తిప్పికొట్టారని, అందుకే అధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని అన్నారు. ప్రధాని మోదీ స్పూర్తితో ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నియోజవర్గ స్థాయిలో సమస్యలపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ సూచించారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.