Home /News /telangana /

HYDERABAD FIGHT BETWEEN TRS AND BJP ACTIVIST AT MALKAJGIRI IN HYDERABAD VRY

Independence fight TRS vs BJP : స్వాతంత్ర్య వేడుకల్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఫైటింగ్ .. ఆసుపత్రికి సంజయ్

Independence fight TRS vs BJP

Independence fight TRS vs BJP

Independence fight TRS vs BJP : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా హైదరాబాద్‌ నగరంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది... ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

    స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల జరుగుతున్న వేళ నగరంలోని మల్కజ్‌గిరిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య అంతర్గత విభేధాలు బయటపడ్డాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం మల్కాజ్‌గిరిలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కాగా ఈ సంఘటన మల్కజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హానుమంతరావుతో పాటు స్థానిక బీజేపీ కార్పోరేటర్ శ్రావణ్ కూడా పాల్గొన్నారు..ఇద్దరు నేతలు ఉండగానే సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

    ఈ నేపథ్యంలోనే జెండా ఆవిష్కరణ జరుగుతున్న సయమంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు కూడా బీజేపికి చెందిన కార్యకర్త ఒకరు ఆసుపత్రి పాలు అయ్యారు. అయితే కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల ముందే బాహాబాహికి దిగారు. దీంతో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు దాడిని చిత్రీకరించడంతో వారి ఫోన్లను సైతం గుంజుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉండగా ఘర్షణ జరగడంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

    అయితే ఈదాడిలో మల్కజ్‌గిరి ఏరియా బీజేపి కార్పోరేటర్ శ్రావణ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ బీజేపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు..కాగా దాడిలో గాయపడిన శ్రావణ్ మల్కజ్‌గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోందున్నట్టు సమాచారం. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‌తో పాటు పలువురు నేతలు ఆసుపత్రికి చేరుకోనున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bjp, Hyderabad, Independence Day 2021, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు