హోమ్ /వార్తలు /తెలంగాణ /

Jaggareddy : రానున్న రోజులన్ని ధూంధాం..లే..! జోష్ మీదున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి...

Jaggareddy : రానున్న రోజులన్ని ధూంధాం..లే..! జోష్ మీదున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి...

తన సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ తరపున రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్న తనకు సమాచారం ఇవ్వలేదని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విషయంలో మాట కూడా తనకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తన సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ తరపున రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్న తనకు సమాచారం ఇవ్వలేదని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విషయంలో మాట కూడా తనకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Jaggareddy : కాంగ్రేస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ కొట్టిన ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జోష్‌మీద ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే ఆయన కార్యకర్తలకు భవిష్యత్‌పై ఫుల్ క్లారిటి ఇచ్చారు. ఇందులో భాగంగానే కరోనా తర్వాత వస్తున్న పండగలన్ని సంగారెడ్డిలో దూంధాం గా సెలబ్రేట్ చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...

  శ్రావణ మాసంలో కొనసాగే బోనాల దగ్గర నుండి బతుకమ్మ, దసరా,దీపావళీ పండగలను ధూంధాం గా జరుపుతానని చెప్పారు. కార్యాకర్తలు ప్రజలు చాలా సంతోషంగా ఉండేవిధంగా చర్యలు చేపడతానని చెప్పారు. అయితే గత సంవత్సరం కరోనా నేపథ్యంలోనే పరిస్థితులకు అనుకూలించలేదని, దీంతో వేడుకలకు దూరంగా ఉన్నానని చెప్పారు. కాని ఈ సంవత్సరం లాక్‌డౌన్ లేకపోవడంతోపాటు కరోనా ప్రభావం కూడా తగ్గడంతో రానున్న రోజుల్లో చాలా ఎంజాయ్ చేసే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ సంధర్భంగా బోనాల పండగా శుభాకాంక్షలు కూడా చెప్పారు.


  కాగా జగ్గారెడ్డి పీసీసీ పదవి కోసం చాలానే ప్రయత్నం చేశారు. చివరకు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించింది. దీంతో తన నియోజకవర్గంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తల్లో జోష్‌ను నింపే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా పెద్ద ఎత్తున ఆర్థికంగా సహాయం చేస్తారు. ఇలాంటీ కార్యక్రమాలతోనే కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నా...అతి సులువుగా నియోజవర్గంలో గెలవగలిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సంధర్బంగా కార్యకర్తలే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి నియోజకవర్గంలో సంబురాలు జరిపారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఆయన అనుచరులు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.

  ఇక ఇదే జోష్‌ను కార్యకర్తల్లో నింపేందుకు జగ్గారెడ్డి నియోజకవర్గంలో జరిగే ఈవెంట్స్‌పై ఫోకస్ పెట్టారు. కార్యకర్తలు, ప్రజలు భరోసగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.మరి ఈ జోష్‌తో నియోజకవర్గంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏమేరకు పార్టీకి ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Congress, Jaggareddy, Sangareddy

  ఉత్తమ కథలు