Hyderabad Crime: భార్య చనిపోవడంతో ఇంట్లో తండ్రి, కూతురు ఉంటున్నారు.. 15 రోజుల నుంచి కన్న కూతురుపై అతడు..

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Crime: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో దారుణం జరిగింది. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్య మృతి చెందడంతో ... గత 15 రోజులుగా కుమార్తెపై తండ్రి అఘాయిత్యం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  సైదాబాద్(Saidabad) సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటనను మరువకముందే చాలా ఘటనలు హైదరాబాద్ (Hyderabad)లో చోటు చేసుకుంటున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి.. హైదరాబాద్ తో పాటు తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కంటి రెప్ప‌లా కాపాడాల్సిన క‌న్న తండ్రే కుమారై పై క‌న్నేశాడు. భార్య చ‌నిపోవ‌డంతో.. గ‌త 15 రోజులుగా కూతురిపై అఘాయిత్యానికి పాల్ప‌డుతున్నాడు. వివ‌రాల్లోకి వెళితే.. రాజేంద్ర‌న‌గ‌ర్‌కు చెందిన ఓ వ్య‌క్తి త‌న కుటుంబంతో క‌లిసి నివాసం ఉంటున్నాడు. అక్కడే తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవినాన్ని సాగిస్తున్నాడు. అయితే అతడి భార్య అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం మరణించింది.

  Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


  అప్పటి నుంచి ఒక్కడే ఒంటరిగా తన కూతురుతో ఉంటున్నాడు. భార్య లేక‌పోవ‌డంతో.. అత‌డి క‌న్ను కుమారై ప‌డింది. ఆ బాలికను బెదిరించి.. గత 15 రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. త‌న బాధను ఎవ్వ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క బాలిక స‌త‌మ‌త‌మ‌వుతున్న క్రమంలో ఇంటి బయట ఏడుస్తూ కూర్చోంది.

  ఏమైంద‌ని స్థానికులు ఆరా తీయ‌గా.. విష‌యం మొత్తం చెప్పింది. కోపోద్రిక్తులు అయిన స్థానికులు నిందితుడిని ప‌ట్టుకుని దేహ‌శుద్ది చేశారు. స్థానికుల సాయంతో బాధితురాలు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు బాలిక‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పది రోజుల క్రితం హైదరాబాద్ లో మరో ఘటన చోటు చేసుకుంది.  మంగ‌ళ్‌హాట్ ప‌రిధిలో తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారం జ‌రిగింది. స్థానికంగా ఉండే ఓ యువ‌కుడు అత్యాచారం చేసిన‌ట్లు బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు.

  Hyderabad Murder: హైదరాబాద్ లో దారుణ ఘటన.. ఇంటి నుంచి తప్పిపోయిన మహిళ హత్య.. వివరాలివే..


  11 గంట‌ల‌కు సుమిత్ అనే యువ‌కుడు ఖాళీగా ఉన్న దుకాణం షేటర్‎లోకి చిన్నారిని లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. చిన్నారి కేకలు వేయడంతో.. అక్క‌డికి వెళ్లిన స్థానికులు.. సుమిత్‌ను ప‌ట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. స్థానికుల అలర్ట్‎తో చిన్నారి సేఫ్‎గా బయటపడింది. తప్పించుకున్న నిందితుడిని అత్తాపూర్‎లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హ‌బీబ్‌న‌గ‌ర్ ప‌రిధిలో న‌మో దైన ఓ చోరీ కేసులో సుమిత్ నిందితుడిగా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో అత్యాచారాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

  Blood Donation: రక్తదానం చేస్తే ‘బరువు’ తగ్గుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..


  వారి తల్లిదండ్రుల పిల్లలను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉంటే మంచిది. కఠినమైన చట్టాలు కీచక కాండలను ఆపడం లేదని సర్వేల్లో స్పష్టం అవుతోంది. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయడానికి తీవ్రమైన శిక్షలతో కూడిన చట్టాలను తీసుకు వచ్చినా తెగించిన మగాళ్లు వాటికి భయపడటం లేదని పోలీసుల గణాంకాలే చెబుతున్నాయి. ప్రత్యేకించి దేశ రాజధానిలో జరుగుతున్న అకృత్యాల వివరాలను బట్టి చూస్తే ఈ విషయంపై స్పష్టత వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతండటంతో హైదరాబాద్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
  Published by:Veera Babu
  First published: