Home /News /telangana /

HYDERABAD FATHER BEAT HIS THREE YEAR OLD DAUGHTER TO DEATH IN HYDERABAD SNR

Crime news : తండ్రి కర్కశానికి మూడేళ్ల చిన్నారి బలి .. రెండ్రోజులు మృత్యువుతో పోరాడి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime news:ఓ తండ్రి మూడేళ్ల కూతురిపై తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. లింగవివక్షను మనసులో పెట్టుకొని కొట్టిన దెబ్బలకు రెండు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
ఓ తండ్రి మూడేళ్ల కూతురి(3Year old girl)పై తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. లింగవివక్ష(Gender discrimination)ను మనసులో పెట్టుకొని అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. అభం,శుభం తెలియని పసిపాపపై తన కర్కశాన్ని ప్రదర్శించాడు. బిడ్డను బలితీసుకున్న తండ్రిని బంధువులు, కుటుంబ సభ్యులు చితకబాది పోలీసు(Police)లకు అప్పగించారు. రెండ్రోజుల క్రితం తండ్రి చేతిలో చావు దెబ్బలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది.

.Telangana : హాస్టల్‌లో బాలిక మృతి ..శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అప్పగించడంపై పేరెంట్స్ ఆగ్రహం

ఆడపిల్లలపై ఆక్రోశంతో..
హైదరాబాద్‌ సైఫాబాద్‌లో నివాసముంటున్న బాసిత్ ఆలీఖాన్‌ అనే ఆటోడ్రైవర్‌ కిరాతకానికి కన్నకూతురు బలైపోయింది. 8ఏళ్ల క్రితం సనాను వివాహం చేసుకున్న బాసిత్ అలీఖాన్ నలుగురు ఆడ సంతానం పుట్టారు. భార్య సనా మరోసారి భార్య గర్భం దాల్చింది. అయితే మగపిల్లవాడి కోసం ఎదురుచూస్తున్న బాసిత్ ..వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో జీర్ణించుకోలేకపోయాడు. బాత్రూంలో ఆడుకుంటున్న ఫాతిమాను ఎంత పిలిచినా రావడం లేదనే కోపంతో కొట్టాడు తండ్రి. మూడేళ్ల బాలికను నేలకేసి విసిరికొట్టాడు. తండ్రి చేతిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.



కూతురు పుట్టిందనే కోపం..
భార్య సన అడ్డుకునేందుకు వెళ్లినప్పటికి ఆమెను తోసేసి చిన్నారిని చావబాదాడు తండ్రి బాసిత్. తండ్రి చేతుల్లో తీవ్రంగా గాయపడిన సమయంలో తల్లి సనా బంధువులకు తెలియజేయడంతో వాళ్లంతా హుటాహుటిన ఇంటికి చేరుకొని పసిపాపను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కిరాతకపు తండ్రి బాసిత్‌ను చూసిన బంధువు కోపం తట్టుకోలేక చితకబాదారు. ఆతడ్ని పోలీసులకు అప్పగించారు. తండ్రి చేతుల్లో చావు దెబ్బలు తిన్న చిన్నారి ఫాతిమా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటే క్లారిటీ ఇవ్వలేమని వైద్యులు తెలిపారు. పసిపాప ప్రాణాలను తీసేందుకు ప్రయత్నించిన తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Crime news : మాట్లాడాలని యువతిని పార్కుకు తీసుకెళ్లాడు .. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో ..



అలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదు..
ఇప్పటికే నలుగురు కుమార్తెలు పుట్టారనే కడుపు మంటతో పాటు భార్య మరోసారి గర్భంతో ఉండటంతో మళ్లీ ఆడపిల్లే పుడుతుందనే అపోహ, అసహనం, అసంతృప్తితో పసిపిల్లను చావబాదాడు తండ్రి బాసిత్. ఈవిషయంపై పోలీసులు సీరియస్ అయ్యారు. లింగవివక్షతో భార్యను లేదా ఆమె బిడ్డపై దాడులు చేసే వాళ్లను ఊపేక్షించేది లేదని కఠినంగా శిక్షిస్తామని సైఫాబాద్ ఎస్‌ఐ సత్తయ్య తెలిపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Telangana crime news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు