Home /News /telangana /

HYDERABAD FATHER BEAT 3YEAR OLD GIRL IN HYDERABAD BECAUSE HE WAS ANGRY THAT HE HAD ONLY FOUR DAUGHTERS SNR

Telangana : బాత్రూంలో ఆడుకుంటున్న మూడేళ్ల కూతరిపై తండ్రి కిరాతకపర్వం .. కారణం అదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime news: ఓ తండ్రి మూడేళ్ల కూతురిపై తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. లింగవివక్షను మనసులో పెట్టుకొని అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. అభం,శుభం తెలియని పసిపాపపై తన కర్కశాన్ని ప్రదర్శించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
ఓ తండ్రి మూడేళ్ల కూతురి(3Year old girl)పై తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. లింగవివక్ష(Gender discrimination)ను మనసులో పెట్టుకొని అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. అభం,శుభం తెలియని పసిపాపపై తన కర్కశాన్ని ప్రదర్శించాడు. తండ్రి కోపానికి గురైన చిన్నారి చావు, బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బిడ్డను బలితీసుకోవాలని చూసిన తండ్రి స్థానంలో ఉన్న దుర్మార్గుడ్ని బంధువులు, కుటుంబ సభ్యులు చితకబాది పోలీసు(Police)లకు అప్పగించారు. తండ్రి చేతిలో చావు దెబ్బలు తట్టుకోలేక చావు,బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

CM KCR | I-Day : నేటి నుంచి స్వాతంత్య్ర వజ్రోత్సవాలు.. 2వారాల షెడ్యూల్ ఇదే: సీఎం కేసీఆర్



ఆడపిల్లలపై ఆక్రోశంతో..
జనరేషన్‌ మారిపోయిన తర్వాత ఆడపిల్లలు పుడితే అదృష్టంగా భావిస్తున్నారు. మహాలక్ష్మి అంటూ అదృష్టలక్ష్మి అంటూ బిడ్డతో పాటు తల్లిని పూల బాట మధ్య ఆహ్వానిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. కాని హైదరాబాద్‌ సైఫాబాద్‌లో నివాసముంటున్న బాసిత్ ఆలీఖాన్‌ అనే ఆటోడ్రైవర్‌కి 8ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సనా ఫాతిమా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు బాసిత్. అయితే ఇప్పటి వరకు నలుగురు ఆడ సంతానం పుట్టారు. మరోసారి భార్య గర్భిణితో ఉంది. మగపిల్లవాడి కోసం ఎదురుచూస్తున్న బాసిత్ ..వరుసగా ఆడపిల్లలు పుట్టడం జీర్ణించుకోలేకపోయాడు. బాత్రూంలో ఫాతిమా ఆడుకుంటోందని..తల్లి ఎంత పిలిచినా రావడం లేదనే కోపంతో ఆమెను కొట్టాడు. అంతటితో ఆగకుండా తనలోని రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ భార్య చూస్తుండగానే చిన్నారిని బాత్రూంలోకి బయటకు తీసుకొచ్చి కొట్టాడు. ఆ తర్వాత బిడ్డను నేలపైకి విసిరికొట్టాడు.



కూతురు పుట్టిందనే కోపం..
భార్య సన అడ్డుకునేందుకు వెళ్లినప్పటికి ఆమెను తోసేసి చిన్నారిని చావబాదాడు తండ్రి బాసిత్. తండ్రి చేతుల్లో తీవ్రంగా గాయపడిన చిన్నారి విషయాన్ని తల్లి సనా బంధువులకు తెలియజేయడంతో వాళ్లంతా హుటాహుటిన ఇంటికి చేరుకొని పసిపాపను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కిరాతకపు తండ్రి బాసిత్‌ను చూసిన బంధువు కోపం తట్టుకోలేక చితకబాదారు. ఆతడ్ని పోలీసులకు అప్పగించారు. తండ్రి చేతుల్లో చావు దెబ్బలు తిన్న చిన్నారి ఫాతిమ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటే క్లారిటీ ఇవ్వలేమని వైద్యులు తెలిపారు. పసిపాప ప్రాణాలను తీసేందుకు ప్రయత్నించిన తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Rajanna Sircilla: అత్తారింటికి వెళ్దామని ముచ్చట పడ్డాడు .. ఇంతలోనే ఎవరూ ఊహించని సంఘటన


అలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదు..
ఇప్పటికే నలుగురు కుమార్తెలు పుట్టారనే కడుపు మంటతో పాటు భార్య మరోసారి గర్భంతో ఉండటంతో మళ్లీ ఆడపిల్లే పుడుతుందనే అపోహ, అసహనం, అసంతృప్తితో పసిపిల్లను చావబాదాడు తండ్రి బాసిత్. ఈవిషయంపై పోలీసులు సీరియస్ అయ్యారు. లింగవివక్షతో భార్యను లేదా ఆమె బిడ్డపై దాడులు చేసే వాళ్లను ఊపేక్షించేది లేదని కఠినంగా శిక్షిస్తామని సైఫాబాద్ ఎస్‌ఐ సత్తయ్య తెలిపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Father, Hyderabad crime

తదుపరి వార్తలు