హోమ్ /వార్తలు /తెలంగాణ /

Business Idea: ఈ జాతి కోళ్ల పెంపకంతో రైతులకు భారీగా ఆదాయం.. లక్షల్లో లాభాలు.

Business Idea: ఈ జాతి కోళ్ల పెంపకంతో రైతులకు భారీగా ఆదాయం.. లక్షల్లో లాభాలు.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Plymouth chicken: మనదేశంలో ప్లైమౌత్ రాక్ కోళ్లను.. రాక్ బర్డ్ అని కూడా పిలుస్తారు. ఈ కోడి మాంసం.. మిగతా వాటితో పోల్చితే చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగానూ ఎంతో మంచిది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు (Jobs) మానేసి వ్యాపారాలు చేస్తున్నారు. అందులోనూ వ్యవసాయ ఆధారిత వ్యాపారాల్లో అడుగు పెడుతున్నారు. వివిధ రకాల పంటలు పండిస్తూ.. పశువులను పెంచుతూ.. ఆదాయం పొందుతున్నారు. ఐతే ఇటీవల మాంసానికి విపరితమైన డిమాండ్ పెరిగింది. చికెన్, గుడ్ల వ్యాపారాలు క్రమంగా పెరుగుతున్నాయి. గ్రామాల్లో పెరుగుతున్న కోళ్ల ఫారాలే అందుకు నిదర్శనం. మన దేశంలో బ్రాయిలర్ కోళ్లు, నాటు కోళ్లనే ఎక్కువ మంది పెంచుతున్నారు. కానీ కోళ్లలో విభిన్న జాతులు ఉన్నాయి. కొన్ని రకాల జాతి కోళ్లకు మార్కెట్లో అధిక ధర లభిస్తోంది. మీరు కూడా అలాంటి కోళ్లను పెంచితే..మంచి లాభాలు వస్తాయి. అందులో ప్లైమౌత్ రాక్ జాతి (Plymouth Rock Chicken) కూడా ఒకటి.

Black Pepper Farming : మిరియాల సాగు.. లాభాల వివరాలు ఇవే!

ప్లైమౌత్ రాక్ జాతి కోడి.. అమెరికాకు చెందినది. మన కోళ్లో పోల్చితే.. ఇవి ఎక్కువ బరువు పెరుగుతాయి. ఈకలు కూడా తెలుపు, నలుపు రంగుల్లో ఆకర్షణియంగా ఉంటాయి. ప్లైమౌత్ రాక్ కోళ్లతో ఇటు గుడ్లు.. అటు మాంసం.. రెండు విధాలుగానూ ఆదాయం వస్తుంది. ఈ కోళ్లు సంవత్సరానికి 250 గుడ్లు పెడతాయి. ఒక గుడ్డు సగటు బరువు 60 గ్రాముల వరకు ఉంటుంది. ఈ కోడి కిలోల వరకు బరువు పెరుగుతుంది. అమెరికా నుంచి ఇతర దేశాలకు కూడా ఈ కోళ్ల పెంపకం విస్తరించింది. మనదేశంలో కూడా ప్లైమౌత్ రాక్ కోళ్లను పెద్ద ఎత్తున పెంచుతున్నారు. మార్కెట్లో ఈ కోళ్లకు రేటు బాగా వస్తుంది. మాంసానికి కూడా మంచి ధర లభిస్తోంది.

ప్లైమౌత్ కోళ్ల పెంపకానికి మీ వద్ద పెట్టుబడి లేకుంటే.. బ్యాంకుల నుంచి రుణ కూడా పొందవచ్చు. పౌల్ట్రీ ఫారమ్ కోసం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు ఇతర బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు వంటి పత్రాలను సమర్పించి రుణం తీసుకోవచ్చు.

మనదేశంలో ప్లైమౌత్ రాక్ కోళ్లను.. రాక్ బర్డ్ అని కూడా పిలుస్తారు. ఈ కోడి మాంసం.. మిగతా వాటితో పోల్చితే చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగానూ ఎంతో మంచిది. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఈ కోళ్లకు మార్కెట్‌లో అధిక ధర లభిస్తుంది. అంతేకాదు ప్లైమౌత్ రాక్ జాతికి చెందిన కోళ్లు... తక్కువ సమయంలోనే బరువు బాగా పెరుగుతాయి. తద్వారా తక్కువ కాలంలోనే మీకు అధిక లాభాలు వస్తాయి. మీరు సొంతంగా మార్కెటింగ్ చేసుకోగలిగితే.. మరింత ఎక్కువగా ఆదాయం వస్తుంది.

First published:

Tags: Business Ideas, Farmers

ఉత్తమ కథలు