Hyderabad : సినీ నిర్మాత భూ కబ్జా చేశాడంటూ రైతులు ఆందోళన.. !

Hyderabad : సినీ నిర్మాత భూ కబ్జా చేశాడంటూ రైతులు ఆందోళన.. !

Hyderabad : హైదరాబాద్ శివారలో ఉన్న గొంగ్లూర్ గ్రామంలో దళితుల భూమి కబ్జాకు గురవుతందంటూ స్థానిక రైతులు ఆందోళణ బాట పట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత తమ భూములను కబ్జా చేసి.. బెదిరిస్తున్నారని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Share this:
    మెదక్ .. వీరన్న

    హైదరాబాద్ (hyderabad )రింగు రోడ్డు చుట్టు కొనసాగుతున్న రియల్ దందాలతో  ( real estate ) స్థానిక రైతులు బెంబెలెత్తిపోతున్నారు.. ఎవరు ఎప్పుడు వచ్చి తమ భూములను కబ్జా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బడా వ్యాపారులు, రియల్ దందాలు కొనసాగిస్తున్న వారు అమాయకులైన రైతుల భూములపై కన్నేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుండడంతో రియల్ వ్యాపారుల అక్రమాలు మరింత తీవ్రమయ్యాయి..

    ఈ క్రమంలోనే ఐటి అధికారులు దత్తత తీసుకున్న గొంగ్లూరు గ్రామంలో ఓ ప్రముఖ సిని నిర్మాత భూ కబ్జాలు చేశాడంటూ రైతులు ఆరోపణలు చేస్తున్నారు..అయితే కబ్జాపై రైతులు కేసులు పెట్టినా అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగడం లేదని వారు వాపోతున్నారు. ఇక రైతుల భూములతోపాటు ప్రభుత్వ భూమిని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత కబ్జా పెట్టినట్టు రైతులు చెబుతున్నారు. అయితే దానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    ఇది చదవండి : గ్రేట్ సీఎం.. అర్థరాత్రి పూట పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు... !


    ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా( sangareddy) పుల్కల్ మండలంలో మురళీకృష్ణ అనే సినీ నిర్మాత భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు...మురళి కృష్ణ, గ్రామంలోని 174 సర్వే నంబరులో గల అవుసలి కుంటలో 4ఎకరాల 16 గుంటల భూమిని అన్యాయంగా కబ్జా చేసి సాగుచేస్తున్నారని ఆరోపించారు. దీంతో పాటు గ్రామంలోని కొందరి రైతుల భూములను డబ్బులకు లీజుకు తీసుకొని వారికి తెలియకుండానే సుమారు 40 ఎకరాల భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.. కాగా అంతకుముందు గ్రామంలో చిన్నపాటి భూమిని కొనుగోలు చేసి పక్కనున్న భూములను కబ్జా చేస్తున్న సినీనిర్మాత మురళికృష్ణపై పోలీసులు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఇది చదవండి : అక్క కేసులో విచారణకు వెళ్లి.. చెల్లెలితో సంబంధం.. పెట్టుకున్న కానిస్టేబుల్


    అయితే నిర్మాతపై ఇప్పటికే పది సార్లు కేసులు పెట్టామని , నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టినా.. అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామంలో నిరుపేద కుటుంబాల భూములు పట్టాదారుకు తెలియకుండా రిజిస్ట్రేషన్ లకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుంటే గ్రామస్తులందరం రెండురోజుల్లో జిల్లా ఎస్పీ కార్యలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు.

    దీంతోపాటు గ్రామస్థులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.కాగా ఆ గ్రామాన్ని ఇన్‌కం టాక్స్ అధికారులు కొంతమంది దత్తత కూడా తీసుకుని పలు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా భూ కబ్జాలు ఆగడం లేదని చెప్పారు. అయితే గ్రామస్థుల ఆందోళనకు ప్రభుత్వ అధికారులు కూడా మద్దతు పలుకుతున్నారని బాధితులు చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published: