Home /News /telangana /

HYDERABAD FAMILY MEMBERS WERE ATTACKED WITH KNIFES DUE TO LITTLE REASON AT THE WEDDING IN SECUNDERABAD VB

Family Members Attack: వాటిపై మా పేర్లు ఎక్కడంటూ.. కత్తులతో దాడి చేసుకున్న కుటుంబసభ్యులు.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Family Members Attack: పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న కుటుంబసభ్యులు ఓ చిన్న కారణంతో రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరినొకరు తిట్టుకుంటూ కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు పెద్దలు. అయితే కళ్యాణం జరిగే సమయంలో మాత్రం వధువు, వరుడు తరఫు బంధువులు మాత్రం కాస్తంతా భయంగానే ఉంటారు. ఎప్పుడు ఏసమయంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉంటారు. వధువు మెడలో వరుడు తాళి కట్టే వరకు కాస్తంతా కంగారుగా ఉంటారు. తర్వాత పెళ్లి పనుల్లో బిజీ అయిపోతారు. భోజనాల దగ్గర గొడవ.. పెళ్లి ఫొటోల దగ్గర గొడవ.. ఇలా చిన్న చిన్న కారణాలతో కొంతమంది కావాలనే గొడవలు పడుతుంటారు. ఇలా ఓ పెళ్లి ని బంధువులు, కుటుంబసభ్యుల సమ్మతితో కుదుర్చుకున్నారు. పెళ్లి సంబంధం కుదిరిన దగ్గర నుంచి ముహూర్తం వరకు అందరూ హడావుడిగా ఉన్నారు. పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ఓ చిన్న కారణంతో ఒకరినొకరు తిట్టుకుంటూ.. కుటుంబసభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అంతేకాకుండా ఒకరినొకరు కత్తులతో దాడి కూడా చేసుకున్నారు. దీంతో నలుగురు గాయపడగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. అసలు ఏమైంది.. ఏ విషయంపై వీళ్లకు గొడవ జరిగింది.. అనే వివషయాలను ఇప్పడు తెలుసుకుందాం..

    సికింద్రాబాద్‌ పరిధిలోని తుకారాంగేట్‌ పరిధిలోని చంద్రశేఖర్‌ నగర్‌లో ఓ ఇంట్లో పెళ్లి పనుల్లో కుటుంబీకులు బిజీ అయ్యారు. పెళ్లి పత్రికలు ప్రింట్ చేసుకొని ఇంటికి వచ్చిన వారు.. అందులో తమ పేర్లు లేవని వాగ్వాదానికి దిగారు. ఈ కరణంతోనే కారణంతో కుటుంబీకులు రెండువర్గాలుగా విడిపోయారు. అంతేకాకుండా మాటమాట పెరిగి పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. పక్కనే ఉన్న వ్యక్తులు అడ్డు వచ్చినా వాళ్లపై కూడా కత్తులను దూశారు. ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఎస్ ప్రవీణ్ (30), నోముల పరశురాము(35), డీ యాదగిరి, (42) ఎన్ ప్రతాప్ కుమార్ (32)లు ఉన్నారు.

    వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం వారిని సికింద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఎస్ ప్రవీణ్, నోముల పరశురాముల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గొడవకు దిగిన ప్రతీ ఒక్కరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు ప్రారంభించారు. ఈ ఘటన సికింద్రాబాద్‌ పరిధిలోని తుకారాంగేట్‌ పరిధిలోని చంద్రశేఖర్‌ నగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Attack with knifes, Crime, Marriage, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు