మరో సాఫ్ట్ వేర్ కంపెనీ జనాలకు కుచ్చుటోపి పెట్టింది. హైదరాబాద్ మాదాపుర్ హైటెక్ సిటీ లో మరో సాప్ట్‌వేర్ కంపేని బోర్డు తిప్పేసింది.కోండాపుర్ AMB మాల్ ఎదురుగా యునైటెడ్ అలయన్స్ టెక్నాలజీ ఐటీ కంపెనీ పేరుతో సంస్థ ఏర్పాటు చేసిన ముగ్గురు వ్యక్తులు....సాఫ్ట్ వేర్ జాబ్ పేరిట నిరుద్యోగుల నుంచి 1.50 నుండి 3.50 లక్షలు వసూలు....చేశారు. బాదితులకు నెల రోజుల పాటు కంపెనీ యాజమాన్యం అన్ లైన్ ట్రైనింగ్ ఇచ్చింది.
గత నేల రోజులుగా కంపెనీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కోండాపుర్ కు వచ్చిన బాదితులు....కంపేని ముతబడి ఉండటంతో మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమన్నారు. చివరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోసపోయిన వారు దాదాపు వంద మంది వరకు ఉన్నారు. అయితే జాబ్ ఇచ్చిన కంపెనీ.. నెల రోజుల పాటు అన్ లైన్ ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ పూర్తైనా.. నెల రోజులుగా కంపెనీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో బాధితులు కొడాపుర్ కు వచ్చి ఆరా తీశారు.
కంపెనీ క్లోజ్ అయి ఉండటంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ధీరజ్ ముత్యాల, అఖిల్, విషశ్రీ అనే ముగ్గురు వ్యక్తులు ఉద్యోగం ఇస్తామంటూ తమ నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని బాధితులైనా పవన్, రితీష్, యతీష్ లు పోలీసు ఫిర్యాదులో వెల్లడించారు. తమ బ్యాంకుల నుండి డబ్బులు పంపించినట్లు బ్యాంకు అకౌంట్ల డిటైల్స్ కూడా పోలీసులకు అందించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు. కేసు నుమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fake jobs, Hyderabad, Local News, Software jobs