ట్రీట్‌మెంట్ పేరుతో డాక్టర్లు రోగుల బంధువులతో బేరాలు ఆడటం చూశాం. డబ్బిస్తేనే వైద్యం చేస్తామన్న వైద్యుల గురించి విన్నాం. కొత్తగా బయటపడిన విషయం ఏమిటంటే హైదరాబాద్ (Hyderabad)లాంటి మహానగరంలో బంజారాహిల్స్(Banjarahills)వంటి హై అండ్ కాస్లీ ఏరియాలో ఉన్న విరంచీ ఆసుపత్రికి డాక్టర్(doctor) వేషం వేసుకొని ఓ 19ఏళ్ల కుర్రాడు వెళ్లాడు. ఏమాత్రం డౌట్ రాకుండా నేరుగా ఐసీయూలోకి వెళ్లి ఓ రోగి కండీషన్ తెలుసుకున్నాడు. రోగి కుటుంబ సభ్యులకు ఫోన్(Phone) చేసి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశాడు. ఈ ఎపిసోడ్ చెప్పడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికి ఆసుపత్రితో ఎలాంటి సంబంధం లేని ఓ 19సంవత్సరాల యువకుడు నేరుగా ఐసీయూలోకి వెళ్లి డాక్టర్‌ని అని బిల్డప్ ఇచ్చి అక్కడున్న ఓ రోగి కేస్ షీట్(Case sheet) చూసి అందులో ఫ్యామిలీ డిటెయిల్స్ (Family Details)నోట్ చేసుకున్నాడు.అటెండెంట్ ఫోన్ నెంబర్‌కి కాల్ చేశాడు.
డాక్టర్ గెటప్‌లో హాస్పిటల్‌కు..
ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్న మీ పేషెంట్‌కి అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి వెంటనే 50రూపాయలు పంపించాలని ఫోన్‌లో చెప్పాడు. రోగి తాలుకు బంధువులు ఫోన్ కాల్‌తో షాక్ అయ్యారు. అదే షాక్ నుంచి తేరుకొని మాకు ఈఎస్‌ఐ వర్తిస్తుంది..డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఎదురప్రశ్నించారు. నకిలీ డాక్టర్ వెంటనే ఫోన్‌కాల్ కట్ చేయడంతో రోగి బంధువులకు అనుమానం వచ్చి ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. తమను ఆపరేషన్ పేరుతో ఎవరో డాక్టర్ పేరుతో డబ్బులు అడుగుతున్నారని కంప్లీంట్ చేయడంతో విషయం బయటకువచ్చింది.
డూప్లికేట్ డాక్టర్ గుట్టురట్టు..
ఈనెల 16వ తేదిన ఈ సంఘటన జరిగింది. అయితే రోగి బంధువులు తమకు జరిగిన చేదుఅనుభవాన్ని ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అంతే వాళ్లు సైతం ఆశ్చర్యపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిసీవుడ్ కాల్స్ నెంబర్, ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ వచ్చి విజిట్ చేసిన సీసీ ఫుటేజ్‌ని సేకరించారు. పోలీసులు నిందితుడ్ని గుర్తించారు. సంతోష్‌నగర్‌కి చెందిన మహ్మద్ జకీరుద్దీన్‌గా తేల్చారు. డాక్టర్ వేషంలో వచ్చిన నకిలీగాడు అతనేనని..రోగి బంధువులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది అతడేనని నిర్ధారించుకొని కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇదే తరహా మోసాలకు ఏమైనా పాల్పడ్డాడా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నకిలీ డాక్టర్ కార్పొరేట్ ఆసుపత్రిలోని ఐసీయూ గదిలోకి వెళ్లే వరకు సెక్యురిటీ, యాజమాన్యం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు రోగి బంధువులు, పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheating case, Greater hyderabad