(P.Srinivas,New18,Karimnagar)
ఆడవాళ్లపై ఇంటా, బయటా ఆకృత్యాలు, అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు జరుగుతుంటే ...ఇంకా జనం పిచ్చ నమ్మకాలు, మోసగాళ్ల మాటలు పట్టుకొని కొత్త సమస్యలు కొని తెచ్చకుంటున్నారు. ఏ విధంగా ఆడవాళ్లను బ్లాక్మెయిల్ (Blackmail)చేయాలని కొందరు కేటుగాళ్లు చూస్తుంటే .. సరిగ్గా అలాంటి మోసగాళ్ల ఉచ్చులోనే పడుతున్నారు మహిళలు. హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలో ఓ నకిలీ బాబా(Fake baba) సమస్యలు, కష్టాలు పోగొడతానంటూ తన దగ్గరకు వచ్చిన ఆడవాళ్లతో ఏం చేయించాడో తెలిస్తే షాక్ అవుతారు. దొంగ బాబాపై డౌట్ రావడంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని బండారాన్ని బయటపెట్టారు. మహిళల్ని అప్రమత్తం చేశారు.
మహిళల పట్ల దొంగ బాబా నిర్వాకం..
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో మరో నకిలీ బాబా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కష్టాలు, సమస్యలతో సతమతమవుతున్న ఆడవాళ్లను ఆసరాగా చేసుకొని ఆచారం పేరుతో వాళ్లను తన చెప్పు చేతల్లోకి తీసుకున్నాడు. ఇద్దరు అసిస్టెంట్లను ఏర్పాటు చేసుకొని తన దగ్గరకు వచ్చే మహిళలకు ప్రాబ్లమ్స్ తొలగిపోవాలంటే నగ్నంగా పూజలు చేయాలని నమ్మబలికాడు. వాళ్లతో నగ్నంగా పూజలు చేయించాడు. అదే సమయంలో వారికి తెలియకుండా సయ్యిద్ హుస్సేన్ అనే వ్యక్తి ద్వారా మహిళల నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీయించాడు ఫేక్ బాబా గులాం.
ఆడవాళ్ల అర్ధనగ్న వీడియోల, ఫోటోలు..
మహిళలు నగ్నంగా ఉన్న వీడియోలు, ఫోటోలను చూసింది బ్లాక్మెయిల్ చేయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరించాడు గులాం. బాబా ముసుగులో బద్మాష్ వేషాలు గుర్తించిన బాధితులు చాంద్రయాణగుట్ట పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఆదివారం రాత్రి ఇంటికి వెళ్లి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆచారం, పూజల పేరుతో గులాం ముఠా ఈవిధంగా సుమారు 500మంది మహిళలకు సంబంధించిన రహస్య వీడియోలను సేకరించినట్లుగా పోలీసులు తెలిపారు. నకిలీ బాబాను అరెస్ట్ చేసి వీడియోలు, ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు.
మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు..
మహిళలు తమకు సంబంధించిన పర్సనల్ విషయాలు, వ్యవహారాలను ఇతరులతో చెప్పుకోవడం మంచిది కాదని ..మంత్రాలు, ఆచారం పేరుతో ఎవరు ఏది చెప్పినా నమ్మడం సరికాదంటున్నారు. ఇలాంటి మోసగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheating, Hyderabad, Telangana crime news