HYDERABAD EXTRA MARITAL AFFAIR CASES ARE MORE FILED IN THE CURRENT YEAR VRY
Hyderabad : అక్రమ సంబంధాల హత్యలే ఎక్కువ.. మారుతున్న క్రైం స్ట్రాటజీ...
crime scene
Hyderabad : మారుతున్న సామాజిక జీవన ప్రమాణాలతో పాటు క్రైం రేటు కూడా పెరుగుతోంది. అయితే గతానికంటే భిన్నంగా క్రైం కేసులు నమోదవుతున్నాయి.. ముఖ్యంగా అధిక హత్యలు, అక్రమ సంబంధాల నేపథ్యంలోనే జరుగుతున్నట్టు పోలీసుల అనాలసీస్ చెబుతోంది.
2021 లో హైదరాబాద్ లో హత్యల సంఖ్య ఉహించని స్థాయిలో పెరిగింది. 2020 తో పోల్చుకుంటే ఈ ఏడాది హాత్యల సంఖ్య ఈ స్థాయిలో పెరగడానికి వివాహేతర సంబంధాలే ప్రదాన కారణమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వేర్వేరు సందర్భాల్లో జరిగిన హత్యల కంటే వివాహితర సంబంధాల్లో జరిగిన హత్యలు చాలా క్రూరంగా ఉన్నాయని పోలీసుల విచారణలో తెలింది. 2021వ సంవత్సరంలో, హైదరాబాద్‌లో వేర్వేరు సందర్భాల్లో 85 హత్యలు నమోదైయ్యాయి. ఈ హత్యలకు పరోక్షంగా లేదా ప్రత్యేక్షంగా సహాకరించిన దాదాపు రెండు వందల మంది అనుమానితులను ఈ ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. అయితే హత్యలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. గత ఏడాది 64 హత్యలు నమోదయ్యాయి. 2019 లో ఈ సంఖ్య 84గా ఉంది.ఈ ఏడాది జరిగిన హత్యలకు స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు, సన్నిహిత వ్యక్తులతో హాస్తాలే ప్రదానంగా ఉంటున్నాయని పోలీసుల విచారణలో తెలింది.
అయితే ఈ ఏడాది జరిగిన దాదాపు అన్ని హత్యల్లో వివాహేతర సంబంధాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దాదాపు 60 శాతం హత్య కేసుల్లో వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. చాలా సందర్భాలలో, ఒక వ్యక్తిని ఇద్దరు ఇష్టపడడం లేదా ఒకరికి తెలేయకుండ ఒకరితో ప్రేమాయణం కొనసాగించడం దాని నుండి తలెత్తే వివాదాలే ఈ ఏడాది జరిగిన హత్యల్లో ప్రధాన కారణమని పోలీసులు అభిప్రాపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో, భర్త తన భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న తర్వాత అక్రమ సంబంధం కలిగి ఉన్న వ్యక్తిని చంపడం లేదా ఆమె వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యలను చంపిన సంఘటనలే చాలా వరకు ఉన్నాయని అంటున్నారు సిటీ పోలీసులు.
ఇలా జరిగిన హత్యలన్ని దాదాపు చాలా వరకు చాలా క్రూరంగా ఉంటున్నాయని అంటున్నారు పోలీసులు. గతంలో నగరంలో చాలా వరకు గ్యాంగ్ వార్ ను భూ తగాదాల వలన హత్యలు ఎక్కువగా ఉండేవి అయితే గడిచిన కొన్ని ఏళ్లుగా వివాహితర సంబంధాలే నగరంలో జరుగుతున్న చాలా హత్యలకు కారణంగా నిలుస్తోన్నాయి. అలాంటి హత్యలు కొన్ని నెలల తరబడి ప్లాన్ చేసి ఉంటాయి కాబట్టి ఈ హత్యల్లో కోపం లేదా అసూయ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. బాధితులకు తగిలిన గాయాలను పరిశీలించడం ద్వారా దీనిని గమనించామని, ”అని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారి ఒకరు న్యూస్18కి తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జూబ్లీహిల్స్‌లో ఓ వ్యక్తి హత్య సంచలనం సృష్టించింది. కార్మికనగర్‌కు చెందిన బాధితుడు 38 ఏళ్ల టైలర్‌ను అతని భార్య, ఆమె స్నేహితుడితో కలిసి హత్య చేశారు. అతన్ని చంపిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఉంచారు. ఇద్దరు నిందితులు - బాధితుడి భార్య, ఆమె స్నేహితురాలే ఈ హత్యలో ప్రధాన సూత్రదారులుగా విచారణలో తెలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.