Home /News /telangana /

HYDERABAD EXPRESS WAY TO OXYGEN SUPPLY SAID CS SOMESH KUMAR VRY

Oxygen Transport : ఆక్సిజన్ రావాణాకు పోలీస్ ఎస్కార్ట్ .. త్వరగా రప్పించేందుకు వ్యూహం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

oxygen supply : ఇతర రాష్ట్రాల నుండి తెప్పిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లను మరింత వేగవంతంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆర్టీసీ, ట్రాన్స్‌పోర్టు అధికారులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు.

తెలంగాణకు ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుండి ఆక్సిజన్ కేంద్రం కేటాయించిన విషయం తెలిసిందే..అయితే ఇతర రాష్ట్రాల నుండి ఆక్సిజన్ తెప్పించేందుకు సుమారు ఆరురోజుల సమయం పడుతోంది. దీంతో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయో ప్రమాదం ఉంది. ఇ

ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ సరఫరాను మరింత వేగవంతం చేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పక్క రాష్ట్రాల నుండి ఆక్సిజన్ తెచ్చే వాహానాలకు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వాహనాలు ఎక్కడ ఆగకుండా మెకానిక్స్ ఇతర సిబ్బందిని పంపించాలని చెప్పారు. దీంతోపాటు ఎయిర్ క్రాప్ట్‌ల ద్వార ఆక్సిజన్ తరలించేందుకు అనుగుణంగా లారీలను తయారు చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ట్యాంకర్లకు గాను ప్రైవేటు ఆపరేటర్లతో చర్చించి అదనపు ట్యాంకర్లను సమకూర్చాలని చెప్పారు.

వీటి ద్వారా ఆరు రోజుల నుండి మూడు రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.కాగా ఒరిశాలోని అంగూర్ తోపాటు కర్ణాటకాలోని బళ్లారి నుండి తెలంగాణకు ఆక్సిజన్ కేటాయించిన విషయం తెలిసిందే..కాగా రాష్ట్రంలో కూడ ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్‌లను నిర్మిస్తోంది.
Published by:yveerash yveerash
First published:

Tags: Cs somesh kumar, Hyderabad, Oxygen

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు