Hyderabad : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి సడన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రగతి భవన్ లోపలికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి సడన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రగతి భవన్ లోపలికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించాడు. అయితే ఆయనకు ప్రగతి భవన్ సెక్యూరిటి సిబ్బంది చెక్ పెట్టారు. ముందస్తు అనుమతి లేనిదే.. లోపలికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి సెక్యూరిటితో వాగ్వావాదానికి దిగారు. తాను ఎట్టి పరిస్థితిల్లో లోపలికి వెళతానని భీష్మించుకు కూర్చుకున్నాడు. దీంతో న్యూసెన్స్ అవుతుందని భావించిన సెక్యురిటి సిబ్బంది పోలీసు వాహనంలోనే ఆయన్ను తన ఇంటి వద్ద దింపినట్టు తెలుస్తోంది.
అయితే ఇంతకి ఆయన ఎందుకు వచ్చారు. ఎలాంటీ అపాయింట్ మెంట్ లేకుండా నేరుగా ప్రగతి భవన్‌కు ఎందుకు వెళ్లారనేది తేలాల్సి ఉంది. కాగా ఇటివల కూడా ఓ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆయన తెలంగాణ సీఎల్పీలో ప్రత్యక్షమయ్యారు.
సాధారణంగా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా తన మనసులో ఏముంటే అది మాట్లాడటం ఆయన నైజం. ఏ పార్టీ వారితోనైనా ఆయన మనసువిప్పి మాట్లాడుతుంటారు. ఒక్కోసారి ఆయన మాటలు సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలకు ఇబ్బందిగా మారుతుంటుంది. ఇలా దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో కొనసాగి.. రాష్ట్ర విభజన తరువాత టీడీపీలో చేరిన జేసీ దివాకర్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలోకి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ ఆఫీసులోకి వెళ్లి తన పాత్ర మిత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనూ భవిష్యత్తు లేదంటూ కామెంట్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.