హోమ్ /వార్తలు /తెలంగాణ /

HYDERABAD: తోటలో ఫ్రెష్ ద్రాక్షాలు కావాలా..అయితే అక్కడికి వెళ్తే ఫ్రీగా టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు

HYDERABAD: తోటలో ఫ్రెష్ ద్రాక్షాలు కావాలా..అయితే అక్కడికి వెళ్తే ఫ్రీగా టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

HYDERABAD: సేంద్రియ విధానంలో సాగు చేసిన ద్రాక్షకాయలు తినాలనుకునే వారికి ఇదో మంచి వార్త. రాజేంద్రనగర్‌ ద్రాక్ష రిసోర్స్‌ సెంటర్‌లో సాగు చేస్తున్న పండ్లను తినేందుకు, నచ్చినవి కొనుగోలు చేసుకునేందుకు నిర్వహకులు నగరవాసుల్ని అహ్వానిస్తున్నారు. తోటలో తిరుగుతూ నచ్చినవి రుచి చూసి కొనుక్కునే అవకాశం కల్పిస్తున్నారు.

ఇంకా చదవండి ...

ద్రాక్షకాయలు ఇష్టంగా తినే వాళ్లకు ఓ గుడ్ న్యూస్, చెట్ల నుంచి ద్రాక్ష కాయలు, గుత్తులను కోసుకొని తినాలనుకునే వాళ్లకు ఈ వార్త ఎంతగానో ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌ Hyderabad రాజేంద్రనగర్‌ rajendra nagar డివిజిన్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీPROFESSOR JAYASHANKAR AGRICULTURAL UNIVERSITY)లోని ద్రాక్షవనం శనివారం నుంచి అందర్ని ఆహ్వానిస్తోంది. ఇక్కడ శాస్త్రవేత్తలు సుమారు 50రకాల ద్రాక్ష కాయల చెట్లను సాగు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. వాటిని చూడటమే కాకుండా తోటలో తిరుగుతూ నచ్చిన కాయల్ని తింటూ అవసరమైన కాయల్ని కొనుగోలు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు యూనివర్సిటీ అధికారులు. ఇది ఈ ఏడాదే కొత్తగా జరగడం లేదు. చాలా సంవత్సరాలుగా ఉద్యానవన వర్సిటీ అధికారులు సందర్శనతో పాటు ద్రాక్షఫలాల్ని ఈవిధంగా అమ్మతూ వస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా కరోనా (Corona)కారణంగా గత రెండేళ్లుగా ఇక్కడ ద్రాక్షవనాన్ని సందర్శించేందుకు నగరవాసుల్ని అనుమతించలేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో శనివారం నుంచి సందర్శకులు ద్రాక్షతోటల్ని సందర్శించడంతో పాటు వారికి నచ్చినన్ని కొనుగోలు చేసుకునే అకాశం కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు. రాజేంద్రనగర్‌ అగ్రికల్చరల్‌ వర్సిటీలోని ఏడెకరాల స్థలంలో ద్రాక్ష తోటలను పెంచుతున్నారు అధికారులు. కేవలం సేంద్రియ ఎరువుల(Organic fertilizers)ను ఉపయోగించి ఇక్కడ ద్రాక్ష సాగు చేస్తున్నారు.

ద్రాక్షవనం సందర్శన..

సుమారు 50కిపైగా ద్రాక్ష రకాలను సాగు చేస్తున్నారు అధికారులు. రంగు రంగుల్లో వెరైటీ రుచుల్లో ఉండే ద్రాక్షకాయలను, గుత్తులను తెంచుకొని తినే సౌకర్యం అందరికి ఉచితంగా కల్పిస్తున్నారు. ద్రాక్ష రిసోర్స్‌ సెంటర్‌లో పండిస్తున్న సాగులో ఒకటి రెండు రకాలు కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో లభించే వివిధ రకాల పేర్లతో ఉండే ద్రాక్షకాయల్ని సాగు చేస్తున్నారు. నానాకర్పూర్, కాజినల్, రెడ్‌క్లూప్, కిస్‌మిస్‌ పేర్లతో పాటు మరికొన్ని రకాల ద్రాక్షాలు నోరూరిస్తూ ఉంటాయి.

(ప్రతీకాత్మకచిత్రం)

నచ్చినవి కోసుకోవచ్చు..వాటిని కొనుక్కోవచ్చు..

హైదరాబాద్‌ వంటి మహానగరంలో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ఇలాంటి ద్రాక్ష పండ్ల ప్రదర్శన, అమ్మకాలు జరుగుతాయనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే మార్కెట్‌లో , ఫుట్‌పాత్‌లు, బండ్లపై పెట్టి విక్రయించే రసాయనాలతో సాగు చేసిన రెండు, మూడు రకాల ద్రాక్షకాయల్ని మాత్రమే నగరవాసులు కొనుగోలు చేస్తుంటారు. కాని ఆరోగ్యానికి ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. అలాంటి పండ్లు చెట్లపై నుంచి ఫ్రెష్‌గా తెంచుకొని రుచి చూసి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది అగ్రికల్చల్ వర్సిటీలోని ద్రాక్షసాగు రిసోర్స్‌ సెంటర్. అయితే ఇది కేవలం వ్యాపార దృక్పథంతో నెలకోల్పలేదని ..రీసెర్చ్‌ కోసం ప్రజలకు మంచి పండ్లు అందించాలన్న లక్ష్యంతోనే కొనసాగిస్తున్నామని రిసోర్స్‌ సెంటర్‌ నిర్వాహకులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడూ సిటీలోనే గడుపుతూ రొటీన్‌ లైఫ్‌కి అలవాటు పడిన నగరవాసులు కాస్త రిలాక్స్ కోసం పిల్లల్ని తీసుకొని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ద్రాక్ష వనాన్ని చూస్తే రిలాక్సేషన్‌ దొరుకుతుంది. మంచి పండ్లు కొనుగోలు చేసుకున్నామనే ఫీలింగ్‌ లభిస్తుంది.

First published:

Tags: Agriculuture, Grapes, Hyderabad

ఉత్తమ కథలు