Home /News /telangana /

HYDERABAD ESTABLISHMENT OF TRANSVISION YOUTUBE CHANNEL FOR RECOGNITION AND RESPECT FOR TRANSGENDER PEOPLE SNR BK HYD

Hyderabad:తోటి ట్రాన్స్‌జెండర్స్ కోసం ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందో తెలుసా..

(హ్యాట్సాఫ్ ట్రాన్స్‌జెండర్ రచన)

(హ్యాట్సాఫ్ ట్రాన్స్‌జెండర్ రచన)

Hyderabad:సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్స్‌ వర్గానికి గుర్తింపు, గౌరవం దక్కాలన్నదే ఆమె ఆలోచన. అందుకోసమే తమ వర్గంలోని వ్యక్తుల్లో మార్పు కోసం పాటుపడుతోంది. ట్రాన్స్‌జెండర్స్ ఎలా ఉండకూడదు...ఎలా నడుచుకుంటే సమాజంలో అందరితో సమానమైన గౌరవం దక్కుతుందనే విషయాన్ని తెలియజెప్పేందుకు వెబ్ సిరీస్‌లు రూపొందిస్తోంది.

ఇంకా చదవండి ...
    (M.Balakrishna,News18,Hyderabad)
    ట్రాన్స్‌జెండర్స్ (Transgender)అంటే చాలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఓ చిన్నచూపు. వాళ్లు చేసే చేష్టలు చూస్తుంటే జనానికి చీత్కారం వస్తోంది. వాళ్ల ప్రవర్తన, నడవడిక ఏది ఎవరికి నచ్చవు. కాని సమాజంలో అందరితో సమానంగానే జీవించాలన్న ఆలోచన, నలుగురితో సరిసమానమైన గుర్తింపు పొందాలనే తపన వాళ్లలో కనిపించదు. కాని హైదరాబాద్‌కి చెందిన రింగమార్పిడి కార్యకర్త రచన ముద్రబోయిన(rachana mudraboyina)మాత్రం ట్రాన్స్‌జెండర్స్‌లో ఓ ఆణిముత్యంగా పేరు తెచ్చుకుంటోంది. ట్రాన్స్‌జెండర్స్‌ అంటే మనుషులేనని వారికి సమాజంలో మిగిలిన వాళ్లతో సరిసమైనన ప్రాధాన్యత కల్పించాలని రచన పోరాడుతోంది. దేశ వ్యాప్తంగా ఆర మిలియన్ మంది ట్రాన్స్‌జెండర్స్‌కి ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు. ఇలాంటి పరిస్థితే మిగిలిన వాళ్లు కలగాలని ..వాళ్లో మార్పు తేవాలని రచన ప్రయత్నిస్తోంది. అందుకోసం ట్రాన్స్ జెండ‌ర్స్ సంఘం చుట్టూ ఉన్న అపోహలు భావాలను తొలగించడానికి, ట్రాన్స్‌విజన్(Transvision)పేరుతో యూట్యూబ్ (YouTube)ఛానెల్‌ని ద్వార స‌మాజంలో చైత‌న్యం తెస్తోంది. ట్రాన్స్ జెండ‌ర్స్ స‌మాజంలో ఎలా ఉండాలి, వారిని స‌మాజం ఎలా గుర్తించాలి అనే అంశాల‌పై వెబ్ సిరీస్‌ (Web Series)‌ల రూపంలో కొన్ని ఎపిసోడ్‌(Episode‌)లు త‌యారు చేసి చైతన్యపరుస్తున్నారు.

    వాళ్లు వెలివేసిన వాళ్లు కాదంట..
    సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ గుర్తింపుతో పాటు గౌరవప్రదమైన స్థాయిలో నడుచుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు స‌మాజం వ్య‌తిరేకించే ప‌నులు చేయ‌డ‌కుండా ఉండేందుకు ఏం చేయాలనే అంశాలపై కూడా ఈ వెబ్‌ సిరీస్‌లలో రూపొందించారు రచన ముద్రబోయిన. యాచించుకోవడం కాకుండా స్వశక్తితో ఎలా ఎదగాలనే అంశాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ట్రాన్స్ జెండ‌ర్స్ వ‌ర్గంలో విజేత‌లైన వాళ్లు, ఘనత సాధించిన వాళ్లను ఇంటర్వూలు చేసి అటు సమాజంలోని సాధారణ ప్రజలతో పాటు ట్రాన్స్‌జెండర్స్ వర్గంలోని వ్యక్తులకు అవ‌గాహాన క‌ల్పిస్తోన్నారు.

    వర్గం అభ్యున్నతి కోసం ..
    ట్రాన్స్‌జెండర్స్‌ని విద్యావంతులను చేయడం కోసం ట్రాన్స్‌విజన్ బేసిక్స్‌తో ప్రారంభించి..వాళ్లలో విజ్ఞానవంతులుగా మార్చుతోంది. ఇందులో భాగంగనే మొదటగా ట్రాన్స్ జెండర్స్ అంటే ఎవరు? ఇది మానసిక రుగ్మతా?  లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే ఎంటీ? అనే అంశాల‌పై వాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి డౌట్స్‌పైనే ఎపిసోడ్‌లు షూట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈతరహా ప్రయోగానికి మంచి స్పందన వస్తోందని ర‌చ‌న‌ ముద్రబోయిన తెలిపారు. గతంలో రచన ఒక NGOలో పనిచేసింది. దానితో పాటు కమ్యూనికేషన్స్ బాధ్యతలు నిర్వహించింది. ఆ అనుభవంతో పకడ్బందీగా ఒక యూట్యూబ్ చాన‌ల్‌ను ఏర్పాటు చేసి తమ వర్గంలో నిరాదరణకు గురి అవుతున్న వాళ్లను సన్మార్గంలో పెట్టేందుకు విలువైన సమాచారంతో కూడిన అవగాహన కల్పిస్తున్నట్లుగా రచన తెలిపారు. ప్రజల్లో కూడా ట్రాన్స్‌జెండర్స్ అంటే చిన్నచూపు లేకుండా చేయడంతో పాటు సాధికారత కల్పించడం మా ఛానెల్ లక్ష్యం అంటున్నారు ర‌చ‌న‌. ఈ ప్రయత్నం ఆ వర్గంలో సమూల మార్పులు తెస్తుందనే ఆశిస్తున్నామని న్యూస్‌18కి ప్రత్యేక తెలియజేశారు రచన ముద్రబోయిన.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Hyderabad, Transgender

    తదుపరి వార్తలు