ED Raids In Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఈడీ (Enforcement Directorate) తనిఖీలు కలకలం రేపుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి నగరంలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలకు చెందిన సంస్థల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే ఆ కంపెనీ ఎండీ శ్రీధర్ రావు ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పటాన్ చెరువు సహా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సోదాలు ఎందుకు చేస్తున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా హైదరాబాద్ లో ప్రతీ నెలలో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. గతంలో కూడా నగరంలోని ప్రముఖ కార్యాలయాల్లో ఈడీ (Enforcement Directorate) సోదాలు చేయగా..ఇప్పుడు మరోసారి ఫార్మా కంపెనీలో తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా హైదరాబాద్ లో గతేడాది నవంబర్ లో కూడా ఈడీ సోదాలు జరిపింది. నగరం లోని ఎంబిఎస్, ముసద్దీలాల్ జేమ్స్ జ్యువెల్లరీ షోరూంలను అధికారులు సీజ్ చేశారు. రూ.100 కోట్లకు పైగా విలువ గల బంగారం, వజ్రాలను ఈడీ (Enforcement Directorate) అధికారులు సీజ్ చేశారు. సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్తా బినామీల దగ్గర రూ.50 కోట్లు బినామీ ప్రాపర్టీని అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో భాగంగా ఈడీ (Enforcement Directorate) అధికారులు పలు కీలక విషయాలను గుర్తించారు. అక్రమ మార్గంలో బంగారాన్ని సుఖేష్ గుప్తా కొనుగోలు చేసినట్టు దీనిపై గతంలోనే సుఖేష్ గుప్తాపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయినా కానీ సుఖేష్ గుప్తా తీరు మార్చుకోలేదని తెలుస్తుంది.
ఎంబిఎస్ గ్రూప్
కాగా గతంలో ఎంబిఎస్ (Mbs) గ్రూప్ సంస్థలు 5 శాతం పన్నులు అదనంగా చెల్లించాలని పారెక్స్ స్థానాలను నిర్వహించేందుకు ఎంఎంటీసీ (Mmtc) నుండి క్రెడిట్ పై బంగారాన్ని పొందాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు 2014వ సంవత్సరంలో సీబీఐ (Cenral burew of Investigation) అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు ముసద్దీలాల్ జ్యువెల్లర్స్ పై అధికారులు సోదాలు చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా నిధులను మళ్లించారని ముసద్దీలాల్ జ్యువెల్లర్స్ పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో సోదాలు చేయగా తాజాగా మరోసారి నేడు ఈడీ (Enforcement Directorate) అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ పత్రాలు చూపించారని ఈ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా గత 6 నెలల్లో అనేక సార్లు హైదరాబాద్ లో ఐటీ, ఈడీ రైడ్స్ జరిగాయి. ప్రముఖ నాయకులు, వ్యాపారసంస్థలు సహా రియల్ ఎస్టేట్ సంస్థల్లో అధికారులు సోదాలు చేశారు. అలాగే పలు ఫార్మా కంపెనీల్లో ఐటీ అధికారులు రైడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ జరుగుతున్న రైడ్స్ పూర్తి అయితే కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.