పోలీసులపై పూల వర్షం.. ఎన్‌కౌంటర్ స్పాట్ వద్ద సంబరాలు

చటాన్‌పల్లి బ్రిడ్జి పై నుంచి ఎన్‌కౌంటర్ స్పాట్‌లో ఉన్న పోలీసులపై పూల వర్షం కురిపించారు. తెలంగాణ పోలీస్ జిందాబాద్.. సాహో సజ్జనార్ అంటూ నినాదాలు చేశారు.

news18-telugu
Updated: December 6, 2019, 11:29 AM IST
పోలీసులపై పూల వర్షం.. ఎన్‌కౌంటర్ స్పాట్ వద్ద సంబరాలు
పోలీసులపై పూల వర్షం
  • Share this:
దిశా హత్యాచారం కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిశా ఘటనపై రగిలిపోయిన ప్రజలు.. ఈ ఎన్‌కౌంటర్‌పై ఆనందం వ్యక్తం చేశారు. చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ జరిగిందన్న విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చటాన్‌పల్లి బ్రిడ్జి పై నుంచి ఎన్‌కౌంటర్ స్పాట్‌లో ఉన్న పోలీసులపై పూల వర్షం కురిపించారు. తెలంగాణ పోలీస్ జిందాబాద్.. సాహో సజ్జనార్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాడు డయల్ 100కు ఫోన్ కాల్ చేసి అభినందిస్తున్నారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున 03.30 గంటల ప్రాంతంలో దిశా కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. దిశను చటాన్ పల్లి సమీపంలో తగులబెట్టిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు. తుపాకులను లాక్కోవడం సాధ్యం కాకపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే కాల్పులు జరిపామని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో నిందితులు అరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ నలుగురూ చనిపోయారని వెల్లడించారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>