తెలంగాణ విద్యుత్‌శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు రోడ్డెక్కారు. వేతన సవరణతో పాటు ఆర్టిజన్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లో విద్యుత్ సౌధ దగ్గర ఆందోళనకు దిగారు. వేలాదిగా వచ్చిన విద్యుత్ ఉద్యోగులతో ఖైరతాబాద్- పంజాగుట్ట రోడ్డు పూర్తిగా బ్లాక్ అయింది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడంతో అటుగా వెళ్లే వాహనదారులు, పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆందోళన చేస్తున్న ఉద్యోగుల్ని అడ్డుకునేందుకు విద్యుత్ సౌధ ముందు పోలీసులు మోహరించారు. నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో ఖైరతాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Employees of Electricity department took to streets demanding the implementation of PRC in #Hyderabad Khairatabad-Panjagutta road blocked pic.twitter.com/NWST0JzJ4X
— Naveena Ghanate (@TheNaveena) March 24, 2023
ఆందోళన ఉదృతం..
న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించడంతో పాటు పీఆర్‌సీని వెంటనే అమలు చేయకపోతే తమ ఆందోళనలు ఉదృతం చేస్తామని నినాదాలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana News