హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS MLAs Poaching Case: చంచల్ గూడ జైలుకు ఈడీ బృందం..ప్రత్యేక గదిలో నందకుమార్ స్టేట్ మెంట్ రికార్డ్

TRS MLAs Poaching Case: చంచల్ గూడ జైలుకు ఈడీ బృందం..ప్రత్యేక గదిలో నందకుమార్ స్టేట్ మెంట్ రికార్డ్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నందకుమార్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కాగా ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. 3 రోజుల పాటు నందకుమార్ ను అనుమతించడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ కోరింది. కానీ 2 రోజులు మాత్రమే ఈడీ విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో జైల్లోనే అధికారులు నందకుమార్ ను  అధికారుల బృందం ప్రశ్నిస్తుంది. జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో నందకుమార్ స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. మరి ఈ విచారణలో నందకుమార్ ను ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది? ఈడీ ప్రశ్నలకు నందకుమార్ ఎలాంటి సమాధానాలు చెబుతారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Telangana: చేర్యాల ZPTC దారుణ హత్య..తెలంగాణలో కలకలం

నందకుమార్ ఈడీ విచారణ నేపథ్యంలో రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ రెడ్డి సోదరునితో నందకుమార్ వ్యాపారాలకు సంబంధించిన అంశాలపై ఈడీ  (Enforcement Directorate) విచారించనుంది. నన్ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అందుకే నందకుమార్ నుండి ఇష్టమొచ్చిన స్టేట్ మెంట్ తీసుకోనున్నట్టు తెలిపారు. నన్ను అరెస్ట్ చేసిన మీకు లొంగేది లేదు. ఇది రోహిత్ ఒక్కడి సమస్య BRS సమస్య కాదు యావత్ తెలంగాణ సమస్య. మీరు నన్ను, నా కుటుంబంపై ఎన్ని కుట్రలు చేసినా తగ్గదే లేదని రోహిత్ రెడ్డి తేల్చి చెప్పారు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో నందకుమార్ ద్వారా నన్ను ఇరికించాలని చూస్తున్నారన్నారు.

అసలు కేసు ఏంటి?

అక్టోబర్ 26న ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును పోలీసులు భగ్నం చేశారు. ఒక్కొక్కరికి రూ.50 కోట్లు చొప్పున డీల్ కోసం రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజి మంతనాలు జరిపారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఎమ్మెల్యేలలో రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ఉన్నారు. అయితే  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ కొత్త కుట్రకు పూనుకున్నాడని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.

మరి నందకుమార్ ఈడీ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Bjp, BRS, Enforcement Directorate, Telangana, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు