హోమ్ /వార్తలు /తెలంగాణ /

ED | Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ మెరుపు దాడులు .. బుచ్చిబాబు ఇంట్లోనే 23గంటల పాటు సోదాలు

ED | Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ మెరుపు దాడులు .. బుచ్చిబాబు ఇంట్లోనే 23గంటల పాటు సోదాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ED | Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మరోసారి దేశ వ్యాప్తంగా పలు నగరాల్లోని ప్రముఖుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో కూడా పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఢిల్లీ లిక్కర్‌ స్కాం(Delhi liquor scam)లో ఈడీ దూకుడు పెంచింది. గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మరోసారి దేశ వ్యాప్తంగా పలు నగరాల్లోని ప్రముఖుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌(Hyderabad)లో కూడా పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఈడీ(ED) అధికారులు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla kavitha) ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchibabu) ఇంట్లో ఈడీ అధికారులు సుమారు 23గంటల పాటు సోదాలు చేపట్టారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీగను పట్టుకున్న ఈడీ అధికారులు డొంకను లాగేందుకు ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో విస్తృతంగా సోదాలు చేపడుతున్నారు.

Telangana politics : వజ్రోత్సవాల వేడుకల్లో బయటపడ్డ వర్గపోరు .. కొట్టుకున్న అధికార పార్టీ నేతలు

కీలక పత్రాలు స్వాధీనం ..

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆధారాలు సేకరించేందుకు రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వారం రోజుల క్రితం దేశంలోని కొన్నిప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా చెన్నైలోని అభిషేక్‌రావు నివాసంలో ..హైదరాబాద్‌లో మరికొందరు ఇళ్లలో సోదాలు నిర్వహించింది. తాజాగా శుక్రవారం ఈడీ అధికారులు మరోసారి మెరుపు దాడులు చేశారు. పొరుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 40చోట్ల మెరుపు దాడులు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోనూ సోదాలు ముమ్మరం చేశారు. 25 ప్రత్యేక బృందాలుగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలోనూ సోదాలు జరిపారు.

తీగను పట్టుకొని డొంకను లాగుతున్నారు ..

బుచ్చిబాబు దోమల్‌గూడలోని శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో గోరంట్ల అసోసియేట్స్‌ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు 2009 నుంచి వ్యక్తిగత ఆడిటర్‌గా బుచ్చిబాబు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కవితకు సంబంధించిన జాగృతి కార్యాలయం, ఆమె వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలపై బుచ్చిబాబును అడిగి తెలుసుకున్నట్లు, వాటికి సంబంధించిన పత్రాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ఉదయం మొదల్కొని శనివారం తెల్లవారు జాము వరకు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు ముందుగా గోరంట్ల అసోసియేట్స్‌ ఉద్యోగి, అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన శ్రీధర్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. వివిధ కంపెనీలకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకొని.. వాటి ఆధారంగానే బుచ్చిబాబును ప్రశ్నించారు.

TSRTC: గ్రేటర్ వాసులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త.. ఆ రూట్లో కొత్త సర్వీసులు.. ప్రతీ 40 నిమిషాలకు ఓ బస్సు

మెరుపు దాడులు..

చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు మరికొందరు రాజకీయ ప్రముఖులకు కూడా ఆడిటర్‌గా వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఆయన పలు సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్నారు. దీంతో ఆయా సంస్థలను ఎప్పుడు స్థాపించారు? పెట్టుబడులు, నిధుల మళ్లింపు వంటి అంశాలపై నాఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధానంగా బుచ్చిబాబుతో పాటు రామచంద్రన్‌ పిళ్లై, బోయినపల్లి అభిషేక్‌రావు, ప్రేమ్‌సాగర్‌ నివాసంలో మరోసారి అభినయ్‌రెడ్డి ఇల్లు సహా మరికొన్ని ప్రాంతాల్లో.. సోదాలు నిర్వహించారు. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఢిల్లీ నివాసంలో కూడా సోదాలు నిర్వహించింది ఈడీ.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana crime news, Telangana News

ఉత్తమ కథలు