ED Notices to Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ విచారణపై ఉత్కంఠ వీడింది. ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన కవిత..అనారోగ్య కారణాల వల్ల ఈరోజు హాజరు కాలేనని..మరో రోజు హాజరు అవుతానని తన ప్రతినిధితో ఈడీకి లేఖను పంపింది. ఈ లేఖను పరిశీలించిన ఈడీ అధికారులు ఆమె విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు.
ఈ క్రమంలో కవిత (MLC Kavitha)కు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 20న విచారణకు హాజరు కావాలని అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఈనెల 11న కవిత (MLC Kavitha) ను విచారించిన ఈడీ అధికారులు 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేనని కవిత ఈడీకి లేఖ రాసిన నేపథ్యంలో మరో తేదీన విచారణకు రావాలని ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చింది. దీనితో కవిత ఈడీ విచారణపై సస్పెన్స్ వీడింది. మరి ఈడీ నోటిసులపై కవిత ఎలా స్పందిస్తారో చూడాలి.
ఈ కేసులో అరెస్ట్ అయిన బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై, మనీష్ సిసోడియా కస్టడీ ఇవాళ, రేపటితో ముగియనుంది. అయితే వీరితో కలిపి కవితను (MLC Kavitha) విచారించాలని ఈడీ అధికారులు భావించారు. కానీ కవిత ఇవాళ్టి విచారణకు హాజరు కాలేనని సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఈడీ రామచంద్ర పిళ్లై కస్టడీని పొడిగించాలని కోర్టును కోరారు. కవిత ఇవాళ విచారణకు హాజరు కానీ నేపథ్యంలో మరోసారి కస్టడీని పొడిగించాలని అధికారులు కోర్టును కోరారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే ఈడీ కార్యాలయంలో మహిళను విచారించడంపై కవిత (MLC Kavitha) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈనెల 24 విచారణ చేపడతామని పేర్కొంది. దీనితో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ తరువాత కూడా ఈడీ విచారణకు హాజరవుతా అని కవిత (MLC Kavitha) స్వయంగా తెలిపారు. కానీ దానికి భిన్నంగా ఆమె విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి సమాచారం ఇవ్వడం దానికి ఈడీ సానుకూలంగా స్పందించడం జరిగిపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Hyderabad, Kalvakuntla Kavitha, Telangana